వివేకాది గుండెపోటు కాదు..సొంత ఇంటి గొడ్డ‌లిపోటు??

హ‌త్య‌ కేసులో సీబీఐకి చిక్కిన‌ కీల‌క ఆధారాలు?
ఢిల్లీలో మ‌కాం వేసిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి?
గ‌త సీబీఐ ద‌ర్యాప్తును త‌ప్పించుకునేందుకు వీసారెడ్డి కరోనా డ్రామా?
తాజా ద‌ర్యాప్తు స‌మ‌యంలో వివేకా శ‌వానికి కుట్లేసిన జ‌గ‌న్ మామ గంగిరెడ్డి ఆస్ప‌త్రిలో చేరిక‌?
సీబీఐకి కీల‌క ఆధారాలు అంద‌జేసిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అలియాస్ దొండ్ల ‌వాగు శంక‌ర్‌రెడ్డి?
జ‌గ‌న్ బాబాయ్ హ‌త్య‌కేసులో మ‌రో బాబాయ్‌, త‌మ్ముడు, మామ, త‌న ఆత్మ వీసా బుక్క‌య్యారా?
హ‌త్య‌కేసులో త‌న కుటుంబ‌స‌భ్యుల‌ను త‌ప్పించేందుకే అమిత్ షాతో భేటీ అయిన జ‌గ‌న్?
కుటుంబ‌స‌భ్యులే హ‌త్య‌చేశార‌ని తెలిసి సీబీఐ ఎంక్వ‌యిరీ వ‌ద్ద‌ని ప‌ట్టుప‌ట్టిన జ‌గ‌న్‌?
బెంగ‌ళూరులో వంద‌ల కోట్ల ఆస్తి గొడ‌వ‌ల‌తోనే వివేకాని చంపేశారా?

జ‌గ‌న్‌రెడ్డి బాబాయ్ వివేకానంద‌రెడ్డిది గుండెపోటు కాదు..సొంత ఇంటి గొడ్డ‌లిపోటు అనేది సీబీఐ నిర్ధార‌ణ‌కొచ్చింది. దీనికి సంబంధించిన కీల‌క ఆధారాలు సేక‌రించింది.

సీబీఐ విచార‌ణ ఆరంభం నుంచి క‌రోనా ఒక‌సారి, పార్ల‌మెంటు స‌మావేశాల పేరుతో ఢిల్లీలో మ‌రోసారి జ‌గ‌న్ త‌మ్ముడు వైఎస్ అవినాశ్‌రెడ్డి మ‌కాం వేయ‌డం ఈ హ‌త్య కేసు సూత్ర‌ధారుల్ని ప‌ట్టిస్తోంది.

వివేకానందరెడ్డి గుండెపోటుతో చచ్చిపోయారని సంభ్రమాశ్చర్యాలకు గురైన విజయసాయిరెడ్డి...సీబీఐ ద‌ర్యాప్తు ప్రారంభ‌మైంద‌నేస‌రికి టెస్టుల్లో క‌రోనా నెగెటివ్ వ‌చ్చినా హైద‌రాబాద్ అపోలో చేరారు.

సీబీఐ బృందం విచార‌ణ విరామం అనే న్యూస్ వ‌చ్చేస‌రికి మ‌ళ్లీ క‌రోనా నెగెటివ్ వ‌చ్చిందంటూ జ‌నంలోకి రావ‌డంతో అంద‌రికీ అనుమానాలు ఆరంభ‌మ‌య్యాయి.

ఈసారి సీబీఐ బృందం విచార‌ణ ఆరంభించేస‌రికి వివేకా శ‌వానికి కుట్లేసిన జ‌గ‌న్‌రెడ్డి మామ గంగిరెడ్డికి గుండెపోటొచ్చి ఆస్ప‌త్రిలో చేరారు.

సీబీఐ విచార‌ణ ఆగిపోతే గంగిరెడ్డి గుండెపోటు త‌గ్గిపోతుంద‌నేది వేరే విష‌యం. ఈ సంఘ‌ట‌న‌ల‌న్నీ చూస్తుంటే.. వివేకాది గుండెపోటు కాదు..సొంత ఇంటి గొడ్డ‌లి పోటు అనేది సీబీఐ నిర్ధారించింది.

వివేకానంద‌రెడ్డి చనిపోయిన‌ప్పుడు సీబీఐ ద‌ర్యాప్తు కావాల‌ని, ఆ త‌రువాత వ‌ద్ద‌ని జ‌గ‌న్‌రెడ్డి ప‌ట్టుప‌ట్ట‌డం కూడా ఇంటి హంత‌కులే వివేకాని చంపేశార‌ని లోక‌మంద‌రికీ అర్థమైపోయింది.

కీలకసమాచారమిచ్చిన దొండ్లవాగు శంకర్
హైకోర్టు ఆదేశాల‌తో సీబీఐ విచార‌ణ ఆరంభం అయిన త‌రువాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అలియాస్ దొండ్ల ‌వాగు శంక‌ర్‌రెడ్డి ప‌రారీలో వున్నారు. క‌రోనాకి చికిత్స పొందుతున్నానంటూ చాలా చోట్ల డ్రామాలు న‌డిపాడు.

అయితే సీబీఐ చిక్క‌లేద‌నుకున్నారు కీల‌క సూత్ర‌ధారులు. అయితే హైద‌రాబాద్‌లో దొండ్ల ‌వాగు శంక‌ర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుని మొత్తం గుట్టుమ‌ట్ల‌న్నీ లాగేశాయ‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

దొండ్ల‌వాగు శంక‌ర్ ఇచ్చిన స‌మాచారంతో రెండో విడ‌త విచార‌ణ‌కొచ్చిన సీబీఐ వెతుకులాట తీవ్రం చేసింది. పులివెందులలో చెప్పుల దుకాణం యజమాని మున్నా, అతడి కుటుంబ సభ్యులను విచారించారు.

మున్నా బ్యాంక్‌ లాకర్‌లో రూ. 48 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు. మరికొన్ని బ్యాంకు ఖాతాల్లో రూ. 20 లక్షల ఎఫ్‌డీలు ఉన్నట్లు తేల్చారు సీబీఐ అధికారులు. ఈ డబ్బు ఎక్కడిద‌నేదానిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.

సీబీఐ అదుపులో అవినాశ్‌రెడ్డి దోస్త్ ఉద‌య్‌కుమార్ రెడ్డి
హ‌త్య జ‌రిగిన‌ప్పుడు ముందుగా తెలిసిన వ్య‌క్తి ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.

యురేనియం కర్మాగారంలో పనిచేసే ఉదయ్‌ కుమార్ రెడ్డి ఫోన్ సీజ్ చేసి సీబీఐ అధికారులు డేటాను పరిశీలిస్తున్నారు.

దొండ్ల‌వాగు శంక‌ర్ ఇచ్చిన స‌మాచారంతో ఉద‌య్‌కుమార్‌రెడ్డిపై సీబీఐ ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేయ‌డంతో త‌న ద‌గ్గ‌ర వున్న గుట్టుమ‌ట్ల‌న్నీ క‌క్కేశాడ‌ని స‌మాచారం. ఇక్క‌డ శంక‌ర్‌, ఉద‌య్ దొరికేశార‌నేస‌రికి ఢిల్లీలో వున్న అవినాశ్‌రెడ్డిలో వ‌ణుకు ఆరంభ‌మైంది.

జ‌గ‌న్‌రెడ్డి సీబీఐ ద‌ర్యాప్తు వ‌ద్ద‌న్న‌ది ఇందుకేనా?
వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై అప్ప‌ట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

ఐతే నాటి టీడీపీ ప్రభుత్వం మాత్రం సిట్ ఏర్పాటు చేసింది. పలువురిని విచారించినప్పటికీ కేసు కొలిక్కిరాలేదు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా సిట్‌ ఏర్పాటు చేశారు.

సిట్‌తో న్యాయం జరగడం లేదని.. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ హైకోర్టు. గ‌తంలో సీబీఐ విచార‌ణ కావాల‌ని జ‌గ‌న్‌రెడ్డి డిమాండ్ చేసి ఇప్పుడు వ‌ద్దంటుండ‌టం అనుమానాలు తీవ్రం అయ్యాయి.

ఇది ఇంటి గొడ్డ‌లి వేటు అని అందరికీ అర్థ‌మైపోయింది. గత రెండు నెలలుగా సీబీఐ అధికారుల విచార‌ణ‌లో మొత్తం హ‌త్య వెనుక మిస్ట‌రీనంతా చేధిస్తున్నారు.

హ‌త్య సూత్ర‌ధారులు పాత్ర‌ధారులు వైఎస్ ఇంటివారే?
చంద్ర‌బాబే వైఎస్ వివేకానంద‌రెడ్డిని చంపేశార‌ని జ‌గ‌న్‌రెడ్డి, సాయిరెడ్డి ఒక రేంజ్‌లో ఆరోపించారు. తీరా సిట్ అయినా, సీబీఐ అయినా విచార‌ణలో దిగేస‌రికి అంతా వైఎస్ ఇంటి మ‌నుషులే సూత్ర‌ధారులు పాత్ర‌ధారులుగా తెర‌మీద‌కొస్తున్నారు.

జ‌గ‌న్‌రెడ్డి బాబాయ్ వైెెెఎస్ భాస్క‌ర్ రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వీరి రైట్ హ్యాండ్ దొండ్ల‌వాగు శంక‌ర్‌రెడ్డి, స్నేహితుడు ఉద‌య్‌శంక‌ర్‌రెడ్డిలంతా అటు వైఎస్ వివేకాకి, ఇటు వైఎస్ జ‌గ‌న్‌, మ‌రోవైపు వైఎస్ వివేకా ఇంటి మ‌నుషులే.

వివేకా శ‌వానికి కుట్లేసిన జ‌గ‌న్ మామ గంగిరెడ్డికి సీబీఐ స్ట్రోక్‌!
సీబీఐ విచార‌ణ తీవ్ర‌మ‌య్యేస‌రికి వివేకా శ‌వానికి కుట్లేసి మాయ చేసిన జ‌గ‌న్‌రెడ్డి మామ గంగిరెడ్డికి ఒక్క‌సారిగా గుండెపోటు వ‌చ్చేసింది. ఇటు సీబీఐ విచార‌ణ‌తోనే ఈ స్ట్రోక్ అని పులివెందుల‌లో టాక్‌.

వివేకానంద‌రెడ్డిని చంపేసిన నిందితులు గుండెపోట‌ని డ్రామా ఆడి ఆ త‌రువాత పులివెందుల‌లో గంగిరెడ్డి హాస్పిట‌ల్ కి త‌ర‌లించి గొడ్డ‌లి పోట్ల‌పై డ్రెస్సింగ్ చేసి కుట్లు వేసి హ‌త్య‌కు గ‌ల ఆధారాల‌న్నీ మాయం చేశారు.

ఈ నేప‌థ్యంలో సీబీఐ గంగిరెడ్డిని విచారించే అవ‌కాశం వుంది. ఈ స‌మాచారం తెలిసిన గంగిరెడ్డి గుండెపోటుతో హైద‌రాబాద్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చేరిపోయారు.

తొలి విడ‌త సీబీఐ విచార‌ణ స‌మ‌యంలో విజ‌య‌సాయిరెడ్డి క‌రోనా పేరుతో ఆస్ప‌త్రిలో చేర‌డం, ఇప్పుడు గంగిరెడ్డి రెండూ హ‌త్య‌కేసులో వీరి పాత్ర‌పై అనుమానాలు మ‌రింత పెంచేస్తున్నాయి.

జ‌గ‌న్ ఢిల్లీ టూర్ ఇందుకేనా?
జ‌గ‌న్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఎప్పుడూ దొర‌కిన అమిత్‌షా అపాయింట్‌మెంట్ సంపాదించారు. అయితే రాష్ట్ర అభివృద్ధి నిధులు కోస‌మే అని సాక్షి రాసింది.

కానీ హోంమంత్రిని ఆర్థిక‌సంబంధిత అంశాలు మాత్ర‌మే ప్ర‌స్తావించార‌నే స‌రికి అందరికీ డౌట్ కొట్టింది. సీబీఐ ఏపీలో దూకుడు పెంచ‌డం, అవినాశ్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించ‌డం, ఆయ‌న అనుచ‌రుల్ని, రైట్ హ్యాండ్ని అదుపులోకి తీసుకోవ‌డం, మ‌రోవైపు జ‌గ‌న్ మామ గంగిరెడ్డిని విచార‌ణ‌కి పిలిచే అవ‌కాశం వుండ‌టంతో కేంద్రాన్ని శాంతింప‌జేసే ల‌క్ష్యంతోనే ఢిల్లీ టూర్ సాగింద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కులు అంచనా.

ఇది ఎవ‌రికీ అనుమానం రాకుండా జ‌ల‌శ‌క్తి మంత్రితో భేటీ ఏర్పాటు చేసుకుని పోలవ‌రం ట‌చ్ అప్ ఇచ్చార‌ని స‌మాచారం.

నిందితుల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ ఎలా?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు శ్రీనివాసుల రెడ్డి సూసైడ్ నోట్ రాసి గ‌తంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిగిలిన నిందితుల‌కూ ఇటువంటి ఆత్మ‌హ‌త్య‌ల్లాంటి స్కీమే అమ‌లు చేసే అవ‌కాశం వుంది.

సీబీఐ విచార‌ణ నేప‌థ్యంలో నిందితులు ర‌హ‌స్య ప్ర‌దేశాల‌లో త‌ల‌దాచుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ వీరి ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేద‌నే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.