తిరుమలలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమలలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు ఒకసారి పరిశీలిద్దాం

జగన్ రెడ్డి వచ్చిన మొదట్లోనే తిరుమల బస్ టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేయటం పెద్ద దుమారమే రేపింది

ఇప్పటి వరకు అది ఎలా జరిగింది అనేది స్పష్టంగా ప్రజలకు వివరించలేదు

గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్ రెడ్డి సర్కారు వచ్చిన తరువాత టిటిడిలో కొంత మంది అన్యమతస్తులు అక్రమ మార్గంలో ఉద్యోగులు అయ్యారు

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి వారిని తొలగించాలని పట్టుబట్టిన ఎల్వీ సుబ్రమణ్యాన్నే చివరికి తొలగించిన సంఘటన మనందరికీ తెలుసు

టీటీడీ వెబ్సైట్లోకి అన్యమత ప్రచారం గతంలో ఎప్పుడూ లేని విధంగా యేసయ్య అనే కొన్ని అన్యమత పదాలు ప్రత్యక్షం

జగన్ రెడ్డి వచ్చిన తరువాత మాత్రమే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నది అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం

మత ప్రచారానికి సంబంధించిన వాహనాలు మత ప్రచారానికి సంబంధించి స్టిక్కర్లు ఉన్న వాహనాలు తిరుమల కొండపైకి నిషేధం

కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకసార్లు తిరుమల కొండపై అన్యమత స్టిక్కర్లతో కూడిన వాహనాలు తిరుగుతూ హల్చల్ చేశాయి

తిరుమల కొండ పై మద్యాన్ని విక్రయిస్తూ ఒక మహిళ పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది

జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ చైర్మన్గా నియమించబడిన వైసీపీ నాయకుడు పృథ్వీరాజ్ మహిళతో రాసలీలలు

దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో గుట్టుచప్పుడు కాకుండా రాజీనామా చేయించారు

ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డులను స్వీటులా మార్చటం పై పెద్ద దుమారమే రేగింది

పవిత్రమైన ఈ లడ్డూను అన్ని జిల్లాల్లోనూ విక్రయించాలని తీసుకున్న నిర్ణయం కూడా తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది

తరతరాలుగా ఉంటున్న శ్రీవారి భూములను వేలం వేయాలని జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా దుమారం రేపింది

కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బ తినడమే కాక హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించటం గతంలో ఎన్నడూ లేనంత వివాదంగా మారింది

అన్యమతస్తులకు డిక్లరేషన్ విధానం తరతరాలుగా వస్తున్నది జగన్ రెడ్డి కోసం ఈ డిక్లరేషన్ విధానాన్ని తొలగించే పరిస్థితి

సతీ సమేతంగా సమర్పించాల్సిన పట్టువస్త్రాలను ఒక మంత్రితో కలిసి సమర్పించారు

అయోధ్యలో జరిగిన రామమందిర భూమి పూజ కార్యక్రమాన్ని టీటీడీ ఛానల్ అయిన ఎస్విబిసి ప్రచారం చేయకపోవడం హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది

దేశవ్యాప్తంగా 250కి పైగా టీవీ ఛానళ్లలో ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని టిటిడి ఎందుకు ప్రసారం చేయలేదు

తిరుమల ఎస్వీబీసీ ఛానల్ లో ఒక ఉద్యోగి ఒక భక్తుడికి పంపిన లింక్ లో పోర్న్ సైట్ ఉండటం తిరుమల పవిత్రతను దెబ్బతీసింది

తిరుమల పైన ఎస్వీబీసీ ఛానల్ పైన పర్యవేక్షణ కొరవడటంతో దీనికి కారణం అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

గతంలో టీటీడీ నుంచి ప్రభుత్వానికి 2.5 కోట్ల రూపాయలు వచ్చేది

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 20 రెట్లు పెంచి 50 కోట్ల రూపాయలు టీటీడీ నిధులను ప్రభుత్వంలోకి తెచ్చాడు

గతంలో ఎన్నడూ లేనివిధంగా వెంకన్న బంగారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ రెడ్డి ప్రభుత్వం లోను తెచ్చుకోవటానికి ప్రయత్నించింది

దేవుని బంగారాన్ని ప్రభుత్వ అప్పుకు షూరిటీగా పెట్టడంపై జాతీయ స్థాయిలో విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు

పింక్ డైమండ్ పై అసత్య ఆరోపణలు చేసిన విసా రెడ్డి రమణదీక్షితుల పై టిటిడి 200 కోట్ల పరువు నష్టం దావా వేసింది

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.