ప్రజలూ  అలోచించండి !

ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఒక 2000 నిర్ణయాలు తీసుకుంటే, కోర్టులు అడ్డుకుంది 100 నిర్ణయాలు మాత్రమే. అవి చట్ట విరుద్ధం, న్యాయ విరుద్ధం, రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి అడ్డుకున్నారు. హైకోర్టుతో పాటుగా, సుప్రీం కోర్టు కూడా ఈ నిర్ణయాలు కొట్టేసింది. అంటే 2000 నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటే, 1900 నిర్ణయాలకు కోర్టు అడ్డుకోలేదు. కానీ కోర్టుల పై, ప్రతిపక్షాల పై ఎందుకు ఈ దాడి ?

కరెంట్ చార్జీలు పెంచారు. కోర్టు అడ్డుకుందా? కరెంట్ ఒప్పందాల రద్దును అడ్డుకుంది.ఎందుకంటే అది తప్పు కాబట్టి! పాఠశాలల్లో నాడు-నేడు పెట్టారు  కోర్టు అడ్డుకుందా? మాతృభాషను తీసేస్తానంటే అడ్డుకుంది. ఎందుకంటే అది రాజ్యాంగవిరుద్ధం కాబట్టి! పంచాయతీల్లో పనులు చేస్తే. కోర్టు అడ్డుకుందా? ఆ భవనాలకు మీ పార్టీ రంగులేస్తే అడ్డుకుంది.  ఎందుకంటే. అవి చట్టవిరుద్ధం కాబట్టి!

అసెంబ్లీలో ఈ ఏడాదిలో ఒక 100 చట్టాలు తెచ్చారు, కోర్టు అడ్డుకుందా? మూడు రాజధానులను మాత్రమే అడ్డుకుంది. ఎందుకంటే అది న్యాయ విరుద్ధం కాబట్టి!
పేదలకు పట్టాలు (40 వేల ఎకరాలు) ఇవ్వడం కోర్టు అడ్డుకుందా? ఆవ, మైనింగ్, కొండ, అడవి, ప్రభుత్వ స్కూల్స్ భూములు (వెయ్యి ఎకరాలు) ఇవ్వడం తప్పు అంది. ఎందుకంటే అది అన్యాయం కాబట్టి!

కోర్టు తీర్పుల పై కామెంట్ చేసిన అందరినీ కోర్టు తప్పుపట్టిందా? కొందరికే నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే, అవి అసభ్యం కాబట్టి!  కోర్టు అమ్మఒడి ఆపిందా? రైతు భరోసా నిలిపేసిందా?  చేయూతకు చెయ్యడ్డం పెట్టిందా?ఆర్టీసీ చార్జీలు, కరెంట్ చార్జీలు , పెట్రోలు చార్జీలు పెంచుకోవడాన్ని తప్పు పట్టిందా? ఏది తప్పని చెప్పింది. ఎక్కడైతే చట్టప్రకారం చెయ్యటం లేదో, దాన్ని అడ్డుకుంది.

అమరావతిపై అఫిడవిట్ కు హైకోర్టులో పదిరోజులు కావాలంటారు. మరుసటి రోజే సుప్రీంకు వెళ్తారు. ఇక్కడ టైమ్ అడిగి అక్కడకు వెళ్లడం తప్పని తెలీదా?మైనింగ్ భూములు, ప్రైవేట్ భూములు పేదలకు పంచడం తప్పని తెలీదా? ప్రైవేటు కేసులను ప్రతిపక్షాలకు, కోర్టులకు అంటగట్టి అయ్యో కోర్టులు అడ్డుకున్నాయి అని గావు కేకలు పెడతారు. మీకిష్టమైన వారిని  IAS, IPS , వీసీలుగా తెచ్చుకోవడం తప్పందా? అప్పటికే ఉన్నవారిని పోస్టింగ్ ఇవ్వకపోవడం తప్పంది. ఎందుకంటే అది సబబు కాదు కాబట్టి..!

ఈ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని కోర్టు అడ్డుకుందా? అమ్మఒడి ఆపిందా? రైతు భరోసా నిలిపేసిందా?  చేయూతకు చెయ్యడ్డం పెట్టిందా? లిక్కరు పారుదలకు అడ్డుకట్ట వేసిందా? ఆర్టీసీ చార్జీలు, కరెంట్ చార్జీలు , పెట్రోలు చార్జీలు పెంచుకోవడాన్ని తప్పు పట్టిందా? విశ్వవిద్యాలయాల్లో కులపీఠాల ఏర్పాటును నిలవరించిందా?ఇంగ్లిషు మీడియాన్ని వద్దని చెప్పిందా? ప్రజాధనంతో పదులకొద్దీ సలహాదారులను పెట్టుకోవడాన్ని తప్పుపట్టిందా? హైదరాబాద్ లో భవనాలను అప్పనంగా ధారాదత్తం చేస్తే వద్దందా? కోవిడ్ రోగులకు ఆసుపత్రులు పెట్టొద్దని చెప్పిందా? ఏది తప్పని చెప్పింది. ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంది?

చట్టపరంగా, న్యాయపరంగా,రాజ్యాంగపరంగా సరిగ్గా పనులు చేస్తూ, కోర్టులల్లో ఓడిపోతామని తెలిసీ కావాలని కోర్టుకు వెళ్లడం కోట్లు తగలెయ్యడం మళ్లీ తమను అడ్డుకుంటున్నారని సింపతీ కార్డు తీయడం.ఇలా అయితే, ముందు మీ కండీషనల్ బెయిల్ రద్దు అయ్యేది కదా ?

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.