తెలంగాణ బీజేపీకి ఎవ‌రు వ‌రం.. ఎవ‌రు శాపం?

అభివృద్ధి చేయాల‌న్న త‌ప‌న‌, పార్టీని ముందుకు న‌డిపించాల‌న్న ల‌క్ష్యం.. ఈ రెండు ఉంటే.. ఎవ‌రు ఎలా ... ఎప్పుడైనా పార్టీని న‌డిపించేందుకు అనేక అవ‌కాశాలు వుంటాయి... వ‌స్తాయి కూడా! ఇలాంటి అవ‌కాశా ల‌ను అందిపుచ్చుకుని తెలంగాణ బీజేపీని ముందుకు న‌డిపించింది ఎవ‌రు?  అదేస‌మ‌యంలో త‌మ చిత్తానుసారం వ్య‌వ‌హ‌రించి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది ఎవ‌రు? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. చిత్ర మైన సంగ‌తులు వెలుగు చూస్తాయి. తెలంగాణ‌లో ప్ర‌స్తుత పార్టీ చీఫ్ బండి సంజ‌య్ మాస్ నాయ‌కుడిగా దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే.

ఎంపీల‌ను ఐక్య‌ప‌రుచుకుని, ఇటీవ‌ల జ‌రిగిన దుబ్బాక ఉప ఎన్నిక‌లో బండి సంజ‌య్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేశారు. రాజ‌కీయంగా కూడా ఆయ‌న త‌న చ‌తుర‌త ప్ర‌ద‌ర్శించారు. దుబ్బాక ఉప ఎన్నిక‌లో టీడీపీ పోటీకి దూరంగా ఉండ‌డంలో బండి వ్యూహం పారింది. ఇది.. ఓట్లు చీల‌కుండా.. బీజేపీకి మేలు చే సింది. ఇక‌, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడా ఇదే ఫార్ములా పాటించేలా సంజయ్ చ‌క్రం తిప్పాల‌ని భావించారు. అంటే.. టీడీపీని జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంచేలా  చూడాల‌ని సంజ‌య్ అనుకున్నారు.

అయితే.. ఈ ఆలోచ‌న‌కు కేంద్ర స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి.. అడ్డు వ‌చ్చారు. ఈ ఆలోచ‌న‌ను ప‌క్క‌న పెట్టా రు. ఇక‌, బీజేపీ-టీఆర్ ఎస్ బ్లాక్‌మెయిలింగ్ రాజ‌కీయాల‌కు జీహెచ్ ఎంసీ ఎన్నిక‌లు వేదిక‌గా మారాయ‌నే వాద‌న వ‌చ్చింది. దీంతో ఆంధ్ర సెటిల‌ర్లు ఒక్కరు కూడా బ‌య‌ట‌కు రాలేదు. దాదాపు 40 శాతం మంది టీడీపీ మ‌ద్ద‌తు దారులు కూడా రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇది.. బీజేపీపై తీవ్ర ప్ర‌భావం చూపించింద‌న‌డం లో సందేహం లేదు. భారీ ఎత్తున పోలింగ్ జ‌రుగుతుంద‌ని బీజేపీ భావించింది. ఇదే జ‌రిగి ఉంటే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు ప‌డేది. కానీ, అలా జ‌ర‌గ‌లేదు.

ఈ ప‌రిణామం.. బీజేపీని ఇర‌కాటంలోకి నెట్టింద‌నే చెప్పాలి. వాస్త‌వానికి బీజేపీలో ఇప్పుడున్న ప‌రిస్థితిలో మాస్ లీడ‌ర్ ఎవ‌రైనా ఉన్నారంటే.. అది బండి సంజ‌య్ అనే చెప్పాలి. గ‌తంలో ముర‌ళీధ‌ర్‌రావు, ద‌త్తాత్రేయ‌, అద్వానీల త‌ర్వాత సంజ‌య్ కొత్త ఒర‌వ‌డితో ముందుకు సాగుతున్నార‌న‌డంలో సందేహం లేదు. అయితే.. కిష‌న్ రెడ్డి వేస్తున్న అడుగులు.. పార్టీని బ‌ల‌హీన‌ప‌రుస్తున్న‌య‌ని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. మ‌రి ఈ ప‌రిస్థితి మారేదెప్పుడు.. పార్టీ ప‌రుగులు పెట్టేదెప్పుడు అనేది ఆస‌క్తిగా మారింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.