వలంటీర్లు వసూల్ రాజాలు : TDP


వైసీపీ ప్రభుత్వం రూపొందించిన పథకాలన్నీ అవినీతిమయమే, ఏ స్కీమ్ చూసినా ఏమున్నది గర్వకారణం? ఏ స్కీమ్ చూసినా వైసీపీ నేతలు, వాలంటీర్ల హస్తగతం అని అని టీడీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు పాలనలో పారదర్శకంగా పథకాలు అందించాం టీడీపీ హయాంలో రైతు కూలీల పిల్లలు సగౌరవంగా సాఫ్ వేర్ ఉద్యోగాలు చేశారు. వైసీపీ హయాంలో లంచాలు తీసుకునే వాలంటీర్లు తయారయ్యారు. వారు వసూల్ రాజాలుగా తయారయ్యారు అని పంచుమర్తి అనురాధ  విమర్శించారు.

ఇంకా ఆవిడ ఏమన్నారంటే...

• వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో పేదలను నిండా ముంచింది
• రెక్కాడితే డొక్కాడని పేదలను లంచాల పేరుతో వైసీపీ ప్రభుత్వం పీక్కుతింటోంది
• పిచ్చి బ్రాండ్లను తీసుకొచ్చి వేలకోట్లు దండుకోవడమేనా మద్యపాన దశలవారీ నిషేధమంటే?
• జే ట్యాక్స్ పేరుతో ఏడాదికి రూ. 5 వేల కోట్లు లూటీ చేస్తున్నారు
• ఇసుక మాటున సంవత్సానికి రూ. 5 వేల కోట్లు మింగేస్తున్నారు
• సెంటు పట్టా పథకం పేరుతో ఏడాదికి రూ. 4 వేల కోట్లు దోచేస్తున్నారు
• బర్త్ సర్టివికెట్ కావాలన్నా, పింఛన్ కావాలన్నా వాలంటీర్ కు లంచం ఇవ్వాలి
• వాలంటీర్లు కాదు వసూల్ రాజాలు
• డ్వాక్రా గ్రూపుల నుంచి యానిమేటర్లు డబ్బులు వసూలు చేసి వైసీపీ నేతలతో పంచుకుంటున్నారు
• ఒక్కో డ్వాక్రా గ్రూప్ నుంచి రూ. 2 వేలు వసూలు చేస్తున్నారు.
• రూ. 10 వేలు లంచం ఇస్తేనే మహిళ ఏ కులమో వాలంటీర్ ధువీక్రరణ పత్రం ఇస్తాడు.  
• అమ్మఒడి పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది
• అమ్మఒడి కింద డబ్బు ఇచ్చి వెనక్కు లాక్కోడాన్ని లూటీ అనక ఏమంటారు?
• మత్స్యకార భరోసా పేరుతో మోసం చేశారు
• ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా రోగులకు సాయం అందలేడంలేదు
• అంబులెన్స్ ల నిర్వహణలో రూ. 307 కోట్లు కొట్టేశారు
• ఇళ్ల స్థలాల మాటున వైసీపీ నేతలు భారీ అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారు
• మున్సిపల్ ఏరియా స్థలం కేటాయించాలంటే రూ. 30 వేలు, రూరల్ ఏరియాలో రూ. 15 వేలు లంచం తీసుకుంటున్నారు.
• చంద్రబాబు హయాంలో కట్టిన లక్షల ఇళ్లను నిరుపయోగంగా మార్చారు
• వాహనమిత్ర పథకం పెద్ద భూటకం
• చేసే పని చిత్తశుద్ధితో చేయడం చంద్రబాబును చూసి వైసీపీ నేర్చుకోవాలి
• వైఎస్సార్ ఆసరా కింది నిజమైన లబ్ధిదారులకు సాయం అందలేదు
• కుట్టు మిషన్ ఉన్నచోటల్లా వైసీపీ నేతలు వాలిపోయి ఫోటోకు ఫోజులిస్తున్నారు
• 30 లక్షలమంది రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టారు
• మోటర్లకు మీటర్ల పేరుతో రైతులకు ఉరితాడు వేస్తున్నారు
• వైసీపీ ప్రభుత్వం స్కీమ్ ల పేరుతో స్కామ్ లు చేస్తోంది
• రూ. 2.50 పైసలకు వచ్చే విద్యుత్ ను రూ.11 కు ఎందుకు కొంటున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి
• ముఖ్యమంత్రి సహాయనిధి కింద వైసీపీ నేతలు కోట్లు కొల్లగొట్టారు
• జలయజ్ఞం పేరుతో లక్షల కోట్లు మింగబట్టే 11 చార్జ్ షీట్లు వేశారు
• చీప్ మినిస్టరా-కాపీ మినిస్టరా అని జగన్మోహన్ రెడ్డి గురించి జనం అనుకుంటున్నారు
• చంద్రబాబు హయాంలో పథకాలన్నింటి కాపీ కొట్టి పేర్లు మారుస్తున్నారు
• టీడీపీ హయాంలో 63 నీటి ప్రాజెక్టులను రూ. 83 వేలతో కడితే వైసీపీ ప్రభుత్వం ఒక్క సెంటుకు నీరివ్వలేదు
• యువనేస్తం, పసుపుకుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలను ఎందుకు తీసేశారు?
• అమరావతికి జగన్మోహన్ రెడ్డి మరణశాసనం రాశారు
• పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసేశారు
• వృద్ధులకు పింఛను అందాలంటే వాలంటీర్లకు లంచం ఇవ్వాలా?
• జగన్మోహన్ రెడ్డికి ఒక్క చాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు ఆలోచించాలి
• టీడీపీ హయాంలో కొనుగోలు చేసిన సైకిళ్లను విద్యార్థులకు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వమిది
• లంచం ఎందుకివ్వాలని ప్రజలు తిరగబడి ప్రశ్నించాలి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.