"తానా" బే ఏరియా "ఫుడ్ డ్రైవ్" విజయవంతం
'తానా' 150 నగరాలలో తలపెట్టిన "ఆకలితో ఉన్నవారికి ఆహరం" కార్యక్రమం లో భాగంగా బే ఏరియాలోని 10 నగరాలలో జరిపిన "ఫుడ్ డ్రైవ్" విజయవంతంగా ముగిసింది.
'తానా' కార్యవర్గ సభ్యులైన సతీష్ వేమూరి, భక్త బల్ల, వెంకట్ కోగంటి,రజనీకాంత్ కాకర్ల,రామ్ తోట, కృష్ణ గొంప, యశ్వంత్ కుదరవల్లి, గోకుల్ రాచిరాజు,భరత్ ముప్పిరాల మరియు 'బాటా' కార్యవర్గ సభ్యు లైన వీరు ఉప్పాల ,విజయ ఆసూరి,ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి తదితరులు చలిని, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎంతో ఉషారుగా పాల్గొని జయప్రదం చేసారు.
శతాబ్దం తరువాత వచ్చిన ఈ మహమ్మారితో ఎన్నో ఇబ్బందులు పడుతున్న స్థానికులకు 'తానా' చేసిన ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చింది.
స్థానిక సంస్థలు,ప్రజలు,మీడియా 'తానా' వారిని మనస్ఫూర్తిగా అభినందించారు
'తానా' మాజీ అధ్యక్షులు జయరాం కోమటి మరియు ప్రస్తుత అధ్యక్షులు జయ శేఖర్ తాళ్లూరి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
1 వ రోజు -- ఫ్రీమాంట్ లో..


2వ రోజు-- మిల్పిటాస్ లో..


3 వ రోజు --ట్రేసీ లో..


4 వ రోజు--స్టాక్టన్ లో..



5 వ రోజు--నెవార్క్ లో..


6 వ రోజు --ప్లెసంటన్ లో..



7 వ రోజు --సాన్ హోసే లో..




8 వ రోజు--ఓక్లాండ్ లో..



9 వ రోజు--యూనియన్ సిటీ లో..



10 వ రోజు--మోడెస్టో లో..
