పిల్లలకు కళల పండుగ - పెద్దలకు కనుల పండుగ

NRI
60 రోజుల నిర్విరామ, ఉత్సాహభరిత తానా బాలోత్సవం ముగింపు ఉత్సవాలు నవంబరు 14 న దీపావళి మరియు బాలల దినోత్సవం నాడు జరగటం ఆ కార్యక్రమానికి మరింత శోభ చేకూర్చాయి. ముగింపు ఉత్సవాలను తానా అధ్యక్షులు శ్రీ తాళ్ళూరి జయశేఖర్ గారు తమ ఉత్తేజభరిత ఉపన్యాసం తో ప్రారంభించారు. వారు తమ ఉపన్యాసంలో 'వకారపంచకం' విశిష్టత, అది విధ్యార్ధుల భవిష్యత్తుకు ఎలా దోహదకారి అవుతుందో వివరించారు.

బాలోత్సవం కార్యక్రమ రూపకర్త డాక్టర్ రమేష్ బాబు వాసిరెడ్డి గారు తన అనుభవాలను ప్రేక్షకుల తొ పంచుకున్నారు.

తరువాత తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన, డాక్టర్ జంపాల చౌదరి, తానా కాబోవు అధ్యక్షులు అంజయ్య చౌదరి, సతీష్ వేమూరి గార్లు మాట్లాడి తమ తమ సందేశాలను అందజేశారు.

కరోనా వంటి విపత్కర పరిస్థితులలోగూడ ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తానా బాలోత్సవ కమిటీ, రేఖా ఉప్పలూరి, సునీల్ పాంత్రా, రాజా కసుకుర్తి, సుమంత్ రామిశెట్టి, శ్రీని యలవర్తి గార్లను తానా అధ్యక్షులు జయశేఖర్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమానికి మాతృభూమి ఇండియా నుంచి సినీ, సాంస్కృతిక, క్రీడా ప్రముఖులు కొరటాల శివ, నాగ్ అశ్విన్,రామజోగయ్య శాస్త్రి గారు, పద్మశ్రీ శోభారాజు గారు, కూచిపూడి ప్రముఖులు సత్యనారాయణ గారు, ప్రముఖ నటి మరియు కుచిపూడి కళాకారిణి జ్యోతి రెడ్ది ,హిమాన్సీ కాట్రగడ్డ , గాయకుడు శ్రీ క్రిష్ణ,చదరంగపు గ్రాండ్ మాష్టర్ పెండ్యాల హరిక్రిష్ణ తదితరులు పాల్గొని తమ సందేశాలను చిన్నారులకు అందజేశారు.

ఈ తానా బాలోత్సవం లో ఉత్తర అమెరికా మొత్తం నుంచి 2400 మంది చిన్నారులు, శాస్త్రీయ సంగీతం, తెలుగు పద్యాలు, సినీ నృత్యాలు, సినీ గీతాలు, దేశభక్తి రూపాలు, చిత్రలేఖనం,చదరంగం వంటి మొదలగు 11 రకాల విభాగాలలో, రెండు వయస్సు గ్రూపులలో (5-10, 11-16 సం||) పాల్గొనటం జరిగినది. న్యాయనిర్ణేతలు అందులో 66 మంది విజేతలను గుర్తించి ఈ రోజు ప్రకటించడమైనది.

తానా కార్యవర్గ సభ్యులు అందరు బాలోత్సవ కమిటి ని అభినందించారు , కోశాదికారి సతీష్ వేమూరి గారి ప్రశంశ ఉపన్యాసం తో కార్యక్రమం ముగిసింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.