స్వరశిల్పి బాలుకు స్వరనివాళులర్పించిన తానా వీక్షించిన 50,000 మంది

NRI

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో గానగంధర్వుడు, పద్మభూషణ్‍ డాక్టర్ ఎస్‍.పి. బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా "స్వరశిల్పికి స్వర నివాళి" పేరుతో ఆన్‍లైన్‍ వేదికగా ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమానికి పలువురు ప్రముఖ గాయనీ గాయకులు హాజరై ఎస్‍పిబికి ఘన నివాళులు అర్పించారు.  

ఈ కార్యక్రమాన్ని దాదాపు 50,000 మందికిపైగా చూడటం విశేషం. గతంలో ఎంతోమంది గాయకులతో, ఇతర ప్రముఖులతోనూ లైవ్‍  షో లు నిర్వహించినా ఇంతమంది ఎన్నడూ వీక్షించలేదు. బాలుగారి మీద ఉన్న అభిమానంతో తెలుగువారే కాకుండా, కన్నడ, తమిళవాసులు కూడా ఈ కార్యక్రమాన్ని లైవ్‍లో వీక్షించడం విశేషం.

తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, కార్యదర్శి రవి పొట్లూరి, కల్చరల్‍ కో ఆర్డినేటర్‍ సునీల్‍ పాంత్రా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి  రాజేశ్వరి ఉదయగిరి యాంకర్‍గా వ్యవహరించారు. తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి మాట్లాడుతూ, బాలుగారి మతి చాలా బాధాకరం.

తానాతో బాలుగారికి విడదీయరాని అనుబంధం ఉంది. తానా వేదికపై ఆయన ఎన్నో కార్యక్రమాలను చేశారు. 2009లో చికాగోలో జరిగిన పదిహేడవ తానా మహాసభలలో ఆయనకు తానా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసి సత్కరించింది. బాలుగారికి భారతరత్న అవార్డు ఇవ్వాలన్న డిమాండ్‍కు తానా కూడా తనవంతుగా మద్దతు ఇస్తుంది.

ఈ విషయమై త్వరలోనే మా కార్యవర్గంతో చర్చించి తీర్మానం చేస్తాము.తానా కార్యదర్శి రవి పొట్లూరి మాట్లాడుతూ, మనం మన కుటుంబ సభ్యులతో కన్నా ఆయనతోనే మనం ఎక్కువగా గడిపి ఉంటాము, ఆయన పాటలను వింటూ జీవితాన్ని గడిపాము. ఇప్పుడు ఆయన లేరన్న వార్త తీరని బాధగానే ఉంది.

బాలు గారు జీవించిన 27,000 రోజుల్లో 40,000 పాటలు పాడారు. బాలుగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటలు ఆయనను అమరజీవిగానే ఉంచాయి. ఆయన పేరు మీదుగానే ఓ అవార్డును సష్టించి ఇస్తే ఎంతో బావుంటుందని అనుకుంటున్నాను. ఆయన ప్రతిభకు ఏ అవార్డు ఇచ్చినా సరిపోదు అని పేర్కొన్నారు.

తానా కల్చరల్‍ కో ఆర్డినేటర్‍ సునీల్‍ పాంత్రా మాట్లాడుతూ, తానాతో ఎస్‍పి బాలుగారితో ఉన్న అనుబంధంతో ఈ విషయం తెలిసిన వెంటనే ఇంత స్వల్ఫవ్యవధిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు గాయనీ ప్రముఖులు హాజరుకావడం బాలుగారిపై వారికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తోంది.

బాలుగారిపై తానా నిర్వహించిన ఈ లైవ్‍ షో కార్యక్రమాన్నిఇంత  మంది వీక్షించడం రికార్డుగానే చెప్పవచ్చు. తానా కల్చరల్‍ కో ఆర్డినేటర్‍గా బాలుగారితో తానా వేదికపై పాడుతా తీయగాలాంటి  కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నాను. ఇంతలో ఈ విషాదవార్త తట్టుకోలేకపోతున్నాను. ఆయనతో మంచి కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయానన్న బాధ ఉంది.

ఈ కార్యక్రమానికి వచ్చినవారికి నా ధన్యవాదాలు.ఈ కార్యక్రమానికి ఎంతోమంది గాయనీ గాయకులు హాజరయ్యారు. పద్మభూషణ్‍ డా. పి. సుశీల, పద్మశ్రీ డా. శోభారాజు, సునీత, ఉష, కౌసల్య, సంధ్య, శ్రీరామచంద్ర, రేవంత్‍, శ్రీకృష్ణ, సుమంగళి, పథ్వీచంద్ర, అంజనాసౌమ్య, గీతామాధురి, సమీర భరద్వాజ్‍ హాజరయ్యారు. వారంతా బాలుతో తమకు ఉన్న అనుబంధాన్ని తానా వేదికగా పంచుకున్నారు. టీవీ ఏసియా, స్వరాజ్య ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి సహకరించారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.