దేవుడు లాంటి మనిషి -రామ్ చౌదరి ఉప్పుటూరి

NRI
తానా వారి ఆధ్వర్యంలో  #రామ్ చౌదరి ఉప్పుటూరి దాత గా ఖమ్మం డాన్సర్ దివ్యాంగుడు ఐన అరుణ్ కి అన్నం శ్ర‌ీనివాసరావు గారి చేతుల మీదుగా ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ లో బైక్ ని బహుకరించారు, కార్యక్రమంలో కూరపాటి ప్రదీప్ గారు, బండి నాగేశ్వరరావు గారు, పసుమర్తి రంగారావు గావు పాల్గొన్నారు
దివ్యాంగుడు అయిన అరుణ్ #రామ్ చౌదరి పై హృదయ స్పందన:
దేవుడు మన కంటికి కనపడరు. చూడాలని వున్నా గుడిలో లేదా దేవాలయంలో లేదా చర్చిలో లేదా మసీదు లో అనేక రూపంలలో మాత్రమే చూస్తాం కానీ ప్రత్యక్షముగా ఇలా వుంటారు అని మాత్రం చెప్పలేము. మన ప్రార్ధన, పూజ ఆలకించి మన అవసరాలు భగవంతుడు తీర్చుతూ వుంటారు. ఆది భగవంతుడు ప్రత్యేకత. ఆ భగవంతునీ వివిధ రకాల మతాల వారు అనేక రకాలుగా పిలుస్తారు. రామ్ రహీమ్,జీసస్ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా కూడా పలికే భగవంతుడు మనిషి రూపంలో మన మధ్యలోనే వుంటారు అని నేను నిర్భయంగా చెప్పగలను. అలాంటి దేవుడులాంటి మనిషి మా #రామ్ చౌదరి ఉప్పుటూరి గారు.
దిక్కులేని వారికీ దేవుడే దిక్కు అని మనం అంటూ ఉంటాము కదా అలాంటి దేవుని రూపంలో వుండే మనిషి #రామ్ చౌదరి గారు. కొన్ని వేల మంది అనాధ పిల్లలకి, వృద్ధులకి, దిక్కు లేని వారికీ,పేద వారికీ సహాయంగా ఉంటూ ఎక్కడ కూడా బయట కనపడని వ్యక్తి మా #రామ్ చౌదరి గారు. నాకు తెలిసి కొన్ని వేలు తెలియనివి ఎన్నో.. అన్న కష్టంగా వుంది ఆడుకోండి అనడం ఆలస్యం. లేదా ఎక్కడ అయినా ఇబ్బంది వుంది అని తెలిసిన వెంటనే తన సహాయం తో పాటు తెలిసిన మిత్రులకు కూడా విషయం తెలియచేసి తక్షణమే ఆ అవసరం తీర్చే వ్యక్తి రామ్ చౌదరి గారు. నా తక్కువ పరిచయంలో మా కేబీర్ ఫౌండేషన్ లో వుండే అవసరం ఏమిటో తెలుసుకొని గంటల వ్యవధిలోనే దాతల సహాయంతో మాకు సహాయం చేసిన వ్యక్తి రామ్ సార్. పిల్లలకు అవసరం అయినా నిత్యావసర సరుకులు, బట్టలు, చెప్పులు, బట్టలు పెట్టుకొనే రాక్స్, పిల్లలు క్రింద పడుకోకూడదు అని వారికీ మంచాలు వాటి పైన బెడ్స్ ఏర్పాటు చేసి పిల్లలు అనాధలుగా ఉండకూడదు అని వారికీ తన కుటుంబంనే గిఫ్ట్ గా ఇచ్చి పండుగ రోజు వారితో సంతోషంగా గడిపే అవకాశం ఇచ్చారు.పిల్లలకు ఏ కష్టం రాకుండా వారిని హీరోలా పెంచు వారు గొప్ప స్థాయి లో ఉండాలి. అని వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్న మా రామ్ సార్ గురించి ఏమి చెప్పాలి నేను.
ప్రతి నిత్యం నాకు ఫోన్ చేసి నువ్వు జాగ్రత్త అనవసరం అయినా విషయాలలో వేలు పెట్టకు అని నన్ను ప్రేమగా మందలిస్తూ నేను బాధపడతానేమో అని నన్ను వెంటనే ఓదారుస్తూ వుండే మా రామ్ సార్ గురించి ఎంత చెప్పిన తక్కువే. నేను మీ అన్న ను నీ పూర్తి బాధ్యత నాదే నువ్వు బాగుండాలి తమ్ముడు అని నాకు దైర్యం చెప్పి ప్రతి నిత్యం మా అభివృద్ధి కోసం పాటుపడే మా #రామ్ చౌదరి అన్న.ఆశ్రమం లో డిగ్రీ చదివే అమ్మాయి కి లాప్ టాప్ కావాలి అని అడిగిన వెంటనే తన లాప్ టాప్ ను స్వయంగా ఎయిర్ పోర్ట్ కు వెళ్లి తన మిత్రుని ద్వారా మా ఆశ్రమం కు పంపించారు. ఆశ్రమం లోని ప్రతి ఒక్కరికి లాప్ టాప్ ఇస్తాను. వారికి అమ్మ నాన్న లేరు అనే కొరత రాకూడదు అని కోరుకొనే వ్యక్తి గురించి నేను ఏమని చెప్పాలి. తాను ఎంతో బిజీగా ఉంటూ మా అవసరాల గురించి ఆలోచన చేస్తున్నారు అంటేనే అర్ధం చేసుకోవాలి ఆయన మనిషి రూపంలో వుండే భగవంతుడు అని. మానవ సేవే మాధవ సేవా అని నమ్మే మహోన్నత వ్యక్తి మా #రామ్ చౌదరి ఉప్పుటూరి సార్. మాట కఠినంగా వున్నా మనస్సు మాత్రం వెన్న. అలాంటి గొప్ప వ్యక్తి నీ కన్నా ఆ తల్లి దండ్రులు ఎంత అదృష్టవంతులు కదా. అలాంటి కొడుకు మా కడుపు ఎందుకు పుట్టలేదు అని బాధపడే తల్లి దండ్రులు ఎంతోమంది వున్నారు. ఆయన మాత్రం వారి తల్లి తండ్రినీ దేవుళ్ళు గా భావిస్తారు. ఎక్కడో దూర దేశంలో ఉండి నిరంతరం మన దేశం కోసం ఇక్కడ ప్రజలు బాగుండాలని కోరుకోవడమే కాకుండా వారి కనీస అవసరాలు తీర్చుతున్న మా #రామ్ చౌదరి ఉప్పుటూరి గారు బాగుండాలని కోరుకుంటూ వారి కోసం నిత్యము ప్రార్ధన చేస్తూ ఉంటాము అని మాట ఇస్తూ...
మీ తమ్ముడు కొడవటికంటి బాలరాజు కేబీర్ ఫౌండేషన్ అనాధ, వృద్ధుల ఆశ్రమం, నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎదురు, అడివి తక్కెళ్లపాడు&శ్యామల నగర్, గుంటూరు ఆంధ్రప్రదేశ్, ఇండియా +919704441600

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.