పూరీ జగన్నాథ్ ఐడియా అట్టర్ ’’ఫ్లాప్‘‘

సినిమా వాళ్లు భలే విచిత్రంగా ఉంటారు. వాళ్లు నిరంతరం తమది సేవ అని ఫీలవుతారు. వాళ్లు చేసేదే కాదు, చాలామంది చేసేది సేవే. సినిమా వాళ్లు సేవ చేస్తారు డబ్బు తీసుకుంటారు. గవర్నమెంటు అధికారులంతా ప్రజల సేవకులే.  వారు సేవ చేస్తారు డబ్బు తీసుకుంటారు. ప్రజాప్రతినిధులంతా ప్రజల సేవకులే. వీరు ఏకంగా వ్యాపారాలే చేస్తారు.

పూరీ మ్యూజింగ్స్ పేరిట వేదాంతాలు చెబుతున్న పూరీ జగన్నాథ్ ఇటీవల బాగా వైరల్ అవుతున్నాడు. పూరీకి ప్రాక్టికల్ నాలెడ్జి ఎక్కువే. అన్నీ బానే ఉన్నాయి గాని తన సినిమా గురించి మాట్లాడేటప్పటికి అతను ఒక సినిమా వాడిలాగే మాట్లాడాడు.

పూరీ ఏమంటాడంటే... ఫ్లాప్ సినిమా తీయాలని ఎవడూ తీయడు. ఫ్లాప్ సినిమాలకు తక్కువ రేటింగ్ వేయొద్దు. ఫ్లాప్ సినిమాల వల్లే ఇండస్ట్రీ బతుకుతుంది. 200 సినిమాలు వస్తే 190 ఫ్లాపే కాబట్టి, ఫ్లాపు సినిమాను బతికిస్తేనే సినిమా బతుకుతుంది. కాబట్టి మీరు ఒక రేటింగ్ వేయాలనుకుంటే 2 వేయండి, రెండు వేయాలనిపిస్తే 3 వేయండి ... ఒక నెంబరు పెంచండి అంటాడు.

అసలు అనేక విషయాలు చెప్పే పూరి అసలు విషయం మరిచిపోయారు. అయ్యాపూరీ గారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే... ప్రపంచం మొత్తం అలాగే నడుస్తుంది. విపలమైన వ్యాపారులతో ప్రపంచం నడుస్తుందని దాన్ని కాపాడమంటే ఎలా? పూరి చెప్పింది శుద్ధ తప్పు. మీకు సింపుల్ గా చెబుతాను.

పూరీ రెస్టారెంట్ కు వెళ్లాడనుకుందాం. భోజనం చండాలంగా ఉంది. 1 రేటింగ్ బదులు 2 వేస్తాడా? ఆయన లాజిక్ ప్రకారం వేయాలి కదా. ఎందుకంటే ఆ పనికిమాలిన రెస్టారెంటు వల్ల కొందరు బతుకుతున్నారు కదా. ఆ రెస్టారెంటు కొనే వస్తువులు వల్ల కొన్ని దుకాణాలు బతుకుతున్నాయని కదా. 80 శాతం చెత్త రెస్టారెంట్లే ఉంటాయి కదా. వాటివల్లే కదా ఎక్కువ ఉపాధి. మరి వారు కూడా జీఎస్టీ కడుతున్నారు కదా. వారు కూాడా ఆస్తులు పోగొట్టుకుంటున్నారు కదా. మరి ఫుడ్ బాలేకపోయినా బాగుందని రాసి ఇంకొకడిని రాంగ్ డైరెక్షన్లో వెళ్లమంటావా పూరీ ?

క్వాలిటీ లేని వస్తువులు అమ్మేవాడి వల్ల ఉపాధి దొరుకుతుంది కాబట్టి అవి బాగున్నాయని చెప్పాలా?

మరి టాప్ క్వాలిటీ కెమెరా ఎందుకు కొని సినిమా తీస్తావు... పనికిమాలిన కెమెరాలు తయారుచేసే కంపెనీలో ఉద్యోగులుంటారు కదా.. నువ్వు కొనకపోతే దాన్ని మూసేస్తారుగా ఆ కెమెరా కొని సినిమా తీయి... దాంతో బతుకుతారు కొందరు.

క్వాలిటీ లేని సిమెంటు కొని నీ ఇల్లు కడతావా? అది బాగుందని అందరికీ చెబుతావా? చెప్పగలవా? చెప్పలేవు కదా. నువ్వు ఏపీలో అమ్మే ఊరుపేరు లేని మందు కొనవు కదా.

నువ్వు మంచి బ్రాండ్ మందు తాగుతావు

నువ్వు మంచి బ్రాండ్ బట్టలు వేసుకుంటావు

నువ్వు మంచి బ్రాండెడ్ కారు వాడతావు

నువ్వు మంచి సిమెంట్ తో ఇల్లు కడతావు

నువ్వు మంచి రెస్టారెంట్ కి వెళ్లి తింటావు

నువ్వు మంచి బియ్యమే కొని తింటావు.

కొందరు బతుకుతారు కదా అని నువ్వు క్వాలిటీతో రాజీపడవు కానీ ప్రేక్షకులు, రివ్యూ రైటర్లు మాత్రం రాజీపడి క్వాలిటీ లేని సినిమాలు చూడాల్నా. అయ్యా ఫ్లాప్ సినిమాల్లో 80 శాతం సినిమాలు ఫ్లాపవుతాయని తీసే నిర్మాతకు, దర్శకుడికి తప్ప అందరికీ అర్థమవుంతుంటుంది. కానీ వారు ఎవరూ మాటా వినరు. ఎవరు చేసిన తప్పుకు వారు శిక్ష అనుభవిస్తారు.

కాబట్టి... ఒకసారి ప్రపంచంలో క్వాలిటీ లేని వస్తువులు సేవలు నువ్వు వాడి వాటికి బెటర్ రేటింగ్ ఇచ్చి నువ్వు వేరే వారిని అడుగు.

థాంక్యూ ఫర్ యువర్ రాంగ్ సజెషన్ !

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.