ప్రభుత్వ ఉద్యోగుల్లో 83 శాతం మంది తీవ్ర అసంతృప్తి

ప్రస్తుతంఈ 17 నెలల కాలంలో ఉద్యోగులసమస్యల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్నతీరు పై ప్రభుత్వ ఉద్యోగుల్లోతీవ్ర అసంతృప్తి  ఉందని పలు ప్రైవేట్ సంస్థలుచేసిన సర్వే లో తేలింది.రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మొత్తం 36785 మంది ని పలుప్రశ్నలు  తో ఈ సర్వేనిర్వహించారు . వారి సమస్యల పరిస్కారంపట్ల మరియు వారికీ

ప్రభుత్వం చేకూర్చిన  ఆర్థిక పరమైన  అంశాల పై ఇలాంటి కొన్నిరకాల ప్రశ్నలు సర్వే లో సంధించారు .

మొత్తం36785 మంది సర్వే లో పాల్గొనగా  30532(83  శాతం ) మంది ప్రభుత్వం తీరుపైతీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.

5150మందిఅంటే 14 శాతం మాత్రమే ప్రభుత్వతీరుపై సంతృప్తి వ్యక్తం చేసారు .

మిగిలిన1103 మంది అంటే 3 శాతం మంది తటస్థ వైఖరి  అవలంబించారు  .

17నెలలకాలంలోనే ప్రభుత్వ తీరు పై తీవ్రఅసంతృప్తి రావడానికి కారణాలు వ్యక్తం చేసారు.

1.అధికారంలోకివచ్చిన వారంలోపే సిపియస్ రద్దు చేస్తామన్నారు .ఇప్పుడు అధికారం లోకి వచ్చి 17 నెలలుపూర్తి అయినా సిపియస్ రద్దు చేయలేదని చాలా మంది అసంతృప్తివ్యక్తం చేసారు .

2.ఎన్నికలముందుసకాలంలోనే DA లు ఇస్తామన్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర చరిత్ర లో ఎప్పుడూ లేనివిదంగా 5 DA లు పెండింగ్ లోఉంచారు .

3.గతంలో కంటే మెరుగైన PRC ఇస్తామన్నారు.10 PRC గడువు ముగిసి 27 నెలలు పూర్తి అయినా 11 వ PRC అమలు చేయలేదని అసంతృప్తివ్యక్తం చేసారు.

4.క్షేత్రస్థాయిలో గతంలో ఎన్నడూ లేని విదంగా ప్రభుత్వఉద్యోగుల పై దాడులు,దౌర్జన్యాలుజరుగుతున్నాయని  అసంతృప్తి వ్యక్తం చేసారు .

5.సమస్యలపైప్రాతినిధ్యం చేయడానికి ఈ 17 నెలల కాలంలోఉపాధ్యాయ సంఘాలకు CM గారు ఒక్క అప్పోయింట్మెంట్కూడా ఇవ్వకపోవడం  పలు ఉపాధ్యాయ సంఘనాయకులూ అసంతృప్తి వ్యక్తం చేసారు .

గతంలోఎప్పుడూ ఈ పరిస్థితి ఉపాధ్యాయసంఘాలకు లేదని అసంతృప్తితో  వున్నారు .ఇలాంటి కారణాలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో 83 శాతం మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారని సర్వే సంస్థలు తెలిపాయి  .

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.