ప్రభాస్ సినిమాలో బిగ్ బీకి భారీ పారితోషికం?
బాహుబలి తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాన్ ఇండియా మూవీ ‘సాహో’తో ప్రభాస్ మరోసారి దేశవ్యాప్తంగా అభిమానులను అలరించాడు. ఇక బాలీవుడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ చేసేందుకు అంగీకరించిన ప్రభాస్....టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో మరో పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

వైజ‌యంతీ మూవీస్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సంద‌ర్భంగా ప్రముఖ నిర్మాత, నాగ్ అశ్విన్ మామగారు అశ్వినీదత్ నిర్మిస్తోన్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ టాప్ హీరోయిన్  దీపిక ప‌దుకొణె నటించబోతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రంలో 25 నిమిషాల నిడివి ఉన్న అమితాబ్ పాత్ర కోసం భారీ పారితోషికం ఇవ్వబోతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ చిత్రంలో నటిస్తోన్న బిగ్ బికి దాదాపు రూ.25 కోట్లు రెమ్యున్ రేషన్ ఫిక్స్ అయిందని టాక్ వస్తోంది.

మరోవైపు, దీపిక ప‌దుకొణెకి కూడా ఇప్ప‌టివ‌ర‌కూ ఏ క‌థానాయిక‌కీ ఇవ్వ‌నంత పారితోషికం ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. దీపికకు దాదాపు రూ.20 కోట్లు పారితోషికం ఇవ్వబోతున్నారట. ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో అమితాబ్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ పాత్ర, కథ గురించి అమితాబ్ కు నాగ్ అశ్విన్ స‌వివ‌రంగా ఓ మెయిల్ పంపారట.

నాగ్ అశ్విన్ ఆ పాత్ర గురించి, కథ గురించి పూస గుచ్చినట్టు చెప్పడంతో బిగ్ బి ఇంప్రెస్ అయ్యారట. ఈ పాన్ ఇండియా మూవీలో బిగ్ బీ కూడా నటిస్తే సినిమా రేంజ్ వేరుగా ఉంటుందని నాగ్ అశ్విన్  ఫిక్స్ అయ్యారట.  అందుకే, బిగ్ బీ కి భారీ పారితోషికం ఇచ్చేందుకు వెనుకాడలేదట. ఇక, బిగ్ బీకి సంబంధించిన సీన్ల షూటింగ్ అంతా ముంబైలోని సెట్లోనే జ‌రుపుతామ‌ని చిత్ర‌బృందం హామీ ఇచ్చింద‌ని తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల అలా కుద‌రకపోతే హైద‌రాబాద్ లో జరిగే షూటింగ్ లో బిగ్ బీ పాల్గొనాల్సి ఉంటుందని ఒప్పందం చేసుకున్నారట.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.