ఈ పోలవరం వీడియో చూస్తే... జగన్ ని ఇకపై నమ్మరు

పోలవరం ప్రాజెక్ట్.... 13 జిల్లాల జీవనాడి. అది అన్ని ప్రాంతాలకు సాగు, తాగు నీటిని, పరిశ్రమలకు అవసరమైన నీటిని ప్రత్యక్షంగా, పరోక్షంగా అందించే ప్రాజెక్టు. అది కనుక పూర్తయితే... భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఈ విషయం తెలుసు కాబట్టే... చంద్రబాబు దాని మీద ప్రత్యేక దృష్టిపెట్టాడు. 60 ఏళ్ల నుంచి ప్రతిపాదనల్లో ఉన్న ఆ ప్రాజెక్టు ఇపుడు 80 శాతం పూర్తయితే... అందులో 55 శాతం పనులు ఒక్క చంద్రబాబు హయాంలోనే జరిగాయి .

ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి, తదనంతరం ఇపుడు జగన్ దానిపై గొప్పలు చెప్పి చంద్రబాబు హయాంలో జరిగిన పనుల వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారు. దీనిని ఎవరూ కొట్టిపారేయలేని, కాదనలేని నిజాలతో అత్యంత విపులంగా వివరించిన ఈ వీడియోను చూస్తే ముఖ్యమంత్రి జగన్ పార్టీ బుడగ తేలిపోతోంది. ఈ వీడియో చూసిన వారికి అసలు పోలవరంపై, చంద్రబాబుపై మొత్తం అభిప్రాయం మారిపోతుంది.

YSR హయాంలో జరిగిన పనులు కేవలం 3.5%
​పోలవరానికి జాతీయ హోదాకి ప్రయత్నాలు చేసిన తొలి నేత చంద్రబాబు నాయుడు
కనీసం పోలవరం నిర్మాణ ప్రాంతంలో గ్రామాలను కూడా పరిహారం చెల్లించి ఖాళీ చేయించే పని చెయ్యలేదు పదేళ్ల కాంగ్రెస్ సర్కారు
పోలవరం నిర్మాణ ప్రాంతంలోని 3,800 కుటుంబాలకు పునరావాసం కల్పించి ఆ గ్రామాలను ఖాళీ చేయించిందే 2015 లో
2019 జూన్ 10 జగన్ రివ్యూ లోనే 71.43% పూర్తయిందని దృవీకరణ
భారతదేశంలో ఇంత కష్టతరమైన నిర్మాణం ఇంతవరకు లేదు

పోలవరంలో అవినీతి లేదని విజయసాయికి​ ​రాజ్యసభలో రాతపూర్వకంగా సమాధానం.
​​2018లో జలసంఘం, 2019 ఫిబ్రవరిలో TAC 55,548 కోట్లకి ఆమోదం
జగన్ వచ్చాక​
1. ​వ్యయం తగ్గింపు
2. ​పనులు ఆలస్యం
3. పోలవరం ఎత్తుపై రగడ

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.