ప్రపంచానికి శుభవార్త చెప్పిన ఫైజర్

ఒకవైపు కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో ప్రజలు వణికిపోతున్న సమయంలోనే అమెరికాలోని మందుల తయారీ సంస్ధ ఫైజర్  ప్రపంచానికి శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ కు విరుగుడుగా తాము తయారు చేస్తున్న  కరోనా టీకా సత్ఫలితాలు ఇస్తున్నట్లు ప్రకటంచింది. తాము నిర్వహిస్తున్న కరోనా వైరస్ మూడో దశ ట్రయల్స్ విజయవంతం అయినట్లు స్పష్టంగా ప్రకటించింది. తమ కంపెనీ తయారు చేసి ప్రయోగించిన టీకా 90 శాతం సత్ఫలితాలు ఇస్తున్నట్లు నిర్ధారణ అయ్యిందని కంపెనీ సీఈవో ఆల్బర్ట్ బౌలా ఓ ప్రకటనలో తెలిపారు.  కంపెనీ చెప్పుకుంటున్నది నిజమే అయితే సకల మానవాళికి శుభవార్తనే చెప్పాలి.

జర్మనీలో ప్రముఖ ఫార్మా కంపెనీ బయో ఎన్ టెక్ తో కలిపి ఫైజర్ కంపెనీ కరోనా వైరస్ కు విరుగుడు టీకా తయారు చేస్తోంది. మూడో దశలో చేసిన క్లినికల్ ట్రయల్ లో ఎటువంటి దుష్ఫలితాలు కనబడలేదని కంపెనీ చెప్పటం సంతోషం కలిగించేదే. కంపెనీ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలాఖరులోగానే అమెరికాలో అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతించే అవకాశాలున్నట్లు సమాచారం.

ప్రస్తుత అంచనాల ప్రకారం 2020 చివరి నాటికి తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల వ్యాక్సిన్లు అందిచగలదన్నారు. అలాగే 2021 130 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామంటూ సీఈవో ప్రకటించారు. రెండోదశ క్లినికల్ ట్రయల్స్ అమెరికాలోని సుమారు 39 వేల మందికి ప్రయోగించింది. మూడోదశలో క్లినికల్ ట్రయల్స్  ఫలితాలను మానిటర్ చేస్తున్నపుడు కోవిడ్ సమస్యను సమర్ధవంతంగా నిరోధించటంలో తమ కంపెనీ విజయం సాధించిన విషయాన్ని తమ శాస్త్రజ్ఞులు స్పష్టంగా గుర్తించినట్లు కంపెనీ తెలిపింది.

సరే ఫైజర్ విషయాన్ని పక్కనపెట్టేస్తే ప్రపంచవ్యాప్తంగా సుమారు 100కు పైగా ఫార్మా కంపెనీలు కరోనా వైరస్ కు విరుగుడు టీకాను కనిపెట్టడంలో కృషి చేస్తున్నాయి. వీటిల్లో రష్యా,  చైనా, అమెరికా, బ్రిటన్ దేశాల్లోని సంస్ధలు వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటితో పాటు భారత్ లోని కొన్ని సంస్ధలు కూడా పరిశోధనలను చాలా స్పీడుగా చేస్తున్నాయి. కాకపోతే ఫైజర్ తయారు చేసే టీకా ను ఇండియాలో కూడా తయారు చేయటానికి అవసరమైన ఒప్పందాలు చేసుకుంటుందా లేదా అన్నది సస్పెన్సుగా మారింది.

ఎందుకంటే ఫైజర్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ లో మనదేశమే అతిపెద్ద వేదిగా అందిరికీ తెలిసిందే. కరోనా టీకా వ్యాక్సిన్ ను 94 డిగ్రీల ఫారిన్ హీట్ చల్లదనంలో భద్రపరచాల్సుంటుంది.   అయితే ఇంత చల్లదనం మనదేశంలో అన్నీ చోట్లా సాధ్యంకాదు. అంతటి చల్లదనాన్ని కృత్రిమంగా ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ను భద్రపరిచి దేశమంతటా సరఫరా చేయటం, రోగులకు ఇవ్వటమంటే మామూలు విషయం కాదు. ఏర్పాట్లు చేయచ్చు కానీ దాని ధర మాత్రం బాగా పెరిగిపోతుంది. దాంతో  జనాలందరికీ అందుబాటులో ఉండేది అనుమానమే.

ఇదే సందర్భంలో ఫైజర్ కంపెనీతో 10 కోట్ల వ్యాక్సిన్ సరఫరా కోసం అమెరికా ప్రభుత్వం 195 కోట్ల డాలర్లతో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. అంటే సగటున ఒక్కో డోసుకు 19.50 డాలర్లు పడుతుంది. మన కరెన్సీలో అయితే సుమారు రూ. 1500 అవుతుంది. కనీసం రెండు డోసులు వేసుకుంటే కానీ ఫలితం కనిపించదని కంపెనీయే చెబుతున్న ప్రకారం మనకు రూ. 3 వేలు అవుతుంది. సరే ఏదేమైనా ప్రాణాలతో పోల్చుకుంటే 3 వేల రూపాయలు ఎక్కువేమీ కాదు కదా. చూద్దాం ఫైజర్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్  ప్రపంచానికి ఎంత తొందరగా అందుబాటులోకి వస్తుందో.

How Pfizer vaccine works... know here

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.