ఆ కామెంట్ల‌తో అడ్డంగా దొరికిన మంత్రి పేర్ని...

రాజ‌కీయాల్లో ఉన్న వారు చాలా వ‌ర‌కు ఆచి తూచి మాట్లాడాలి. పైగా అధికారంలో ఉన్న వారు మ‌రింత జా గ్ర‌త్త‌గా ఉండాలి. పూర్వం మాదిరిగా ఇప్పుడు ప‌రిస్థితి లేదు. ఏదైనా స‌రే.. క్ష‌ణాల్లోనే ప్ర‌జ‌ల మ‌ధ్య వ్యాపి స్తోంది. ప్ర‌జ‌ల‌కు  చేరిపోతోంది. దీంతో రాజ‌కీయ నేత‌లు చేసే కామెంట్లు, జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌జ‌ల నుంచి రియాక్ష‌న్ కూడా అంతే వేగంగా వ‌స్తోంది. తాజాగా మంత్రి పేర్ని నాని.. చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో ఇదే త‌ర‌హా కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య ల‌కు కౌంట‌ర్‌గా మంత్రి పేర్ని మాట్లాడారు.

``రాష్ట్రంలో ఐదు శాతం ఓట్లు మ‌ళ్లించ‌గ‌లిగితే.. వైసీపీని అధికారం నుంచి దింపేయొచ్చు. ఆదిశ‌గా పార్టీ శ్రేణులు కృషి చేయాలి!`` అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. సాధార‌ణంగా ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ.. ఆలోచ‌న దీనిక‌న్నా భిన్నంగా ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేరు. అధికార పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌డం తోపాటు.. అధికారం చేజిక్కించుకునేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషించ‌డం స‌హ‌జం. అయితే.. దీనిపై రియాక్ట్ అయిన‌.. మంత్రి పేర్ని నాని.. చంద్ర‌బాబు పై చేసిన విమ‌ర్శ‌లు.. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నాయి. ``ఏపీని వ‌దిలేసి.. హైద‌రాబాద్‌లో ఉంటున్న చంద్ర‌బాబుకు ఓట్లు అడిగే హ‌క్కులేదు`` అని పేర్ని వ్యాఖ్యానించారు.

అయితే.. ఇదే వైసీపీ నేత‌లు.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఎక్క‌డ ఉన్నారో.. చెప్పాల‌ని అంటున్నారు సోష‌ల్ మీడియా జ‌నాలు. వైసీపీ అధినేత జ‌గ‌న్.. హైద‌రాబాద్ ను వ‌దిలి పెట్టింది కేవ‌లం 2019 ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు కొద్ది రోజుల ముందే క‌దా! అంతేకాదు.. చాలా మంది వైసీపీ నాయ‌కులు కూడా పొరుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఉంటున్నారు. సో.. ప్ర‌తిప‌క్ష నేత పై విమ‌ర్శ‌లు చేసే ముందు.. త‌మ పార్టీ ప‌రిస్థితిని కూడా గ‌మ‌నంలో పెట్టుకోవాలి.. క‌దా.. అంటూ.. మంత్రి పేర్నిపై సోష‌ల్ ఈడియాలో కామెంట్లు విసురుతున్నారు. క‌రోనా నేప‌థ్యంలో చంద్ర‌బాబు హైద‌రాబాద్‌కు ప‌రిమిత‌మ‌య్యార‌ని.. ఈ విష‌యాన్ని రాజ‌కీయం చేయ‌డం ద్వారా.. వైసీపీకే న‌ష్ట‌మ‌ని అంటున్నారు. మ‌రి మంత్రి దీనికి ఏమంటారో చూడాలి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.