​మూడు రాజధానులకు వ్యతిరేకంగా జనం తీర్పు !!


వైఎస్ జగన్ రెడ్డికి, ఆయన వంగమాగదులకు, అభిమానులకు ఇది భారీ షాక్. జగన్ ఏం చేసినా ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్న జగన్ రెడ్డి నిర్ణయాల పట్ల ప్రజల్లో ఎంతో వ్యతిరేకత వస్తుంది అని చెప్పడానికి మూడు రాజధానుల నిర్ణయమే ఉదాహరణ.

అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా కర్నూలు, విశాఖ ప్రజలు ఎటువంటి డిమాండ్లు చేయడం లేదు. కేవలం వైకాపా హడావుడి తప్ప మూడు రాజధానులకు జనం ఏ మాత్రం మద్దతు పలకడం లేదు.

ఈ నేపథ్యంలో జాతీయ పత్రిక బిజినెస్ లైన్ ‘‘మూడు రాజధానులు తెలివైన నిర్ణయమా? కాదా? అని పోల్ పెట్టింది. అందులో జగన్ నిర్ణయం తెలివి తక్కువ నిర్ణయం అంటూ జనం తీర్పు ఇచ్చారు.4 లక్షల 20 వేల మంది పోలింగ్ లో పాల్గొంటే 3 లక్షల 20 వేల మంది మూడు రాజధానులు పెట్టడం తెలివితక్కువ నిర్ణయం అని, ఏకైక రాజధాని అమరావతికి మద్దతు పలుకుతూ తీర్పు ఇచ్చారు. దీంతో వైకాపా పరువు మొత్తం గంగలో కలిసింది.

ఇప్పటికే ఏపీలో అనేక విచిత్ర నిర్ణయాలతో ప్రజల ఆగ్రహానికి జగన్ గురవుతున్నారు. అయితే, జగన్ రెడ్డి డబ్బులతో తమ జేబులు నింపుతు ఉండటంతో ఇపుడుఎందుకు మాట్లాడ్డం ఎన్నికలు రానీ అన్నట్టు జనం సైలెంటుగా ఉన్నారు. మొత్తానికి అమరావతి కి ఇంటా బయటా కోర్టులో, మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది.

Today’s Poll
Get live updates of national news, political news, latest news on sports and economy, live news updates, national events, special reports, and international news live reports

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.