నవ ఉత్తేజంతో తెలుగుదేశం...

రాష్ట్ర కమిటీ ఏర్పాటులో పనితీరుకి పట్టం కట్టిన అధినేత చంద్రబాబు
బడుగు,బలహీన వర్గాలదే తెలుగుదేశం
అత్యధికంగా బీసీ,ఎస్సి,ఎస్టీ,మైనార్టీలకు 61 శాతం పదవులు
50 ఉపకులాలకు ప్రాధాన్యత
అన్ని ప్రాంతాలు,అన్ని కులాల సమతుల్యంతో టిడిపి ఏపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు
వారసత్వం కంటే పనితీరుకే ప్రాధాన్యత
యువనాయకత్వానికి పెద్దపీట

తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణంతో నూతనుత్సాహాన్ని నింపుతున్నారు అధినేత చంద్రబాబు.ఓటమి నేర్పిన పాఠాలను విజయానికి మెట్లుగా మార్చుకోవడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు పార్టీని భావితరాలకు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.పార్టీలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు.జిల్లా పార్టీ వ్యవస్థకి స్వస్తి పలికి పార్లమెంటరీ పార్టీ వ్యవస్థ ని తీసుకొచ్చారు.ఇటీవల పొలిట్ బ్యూరో,జాతీయ కమిటీలను ప్రకటించిన టిడిపి శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ని ప్రకటించింది.ఇప్పటికే టిడిపి ఏపీ అధ్యక్షుడిగా బీసీ నేత అచ్చెన్నాయుడుని ప్రకటించిన అధినేత చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు తరువాత ఏపీ రాష్ట్ర కమిటీ ఎంపికను పూర్తి చేసారు.

219 మందితో టిడిపి ఆంధ్రప్రదేశ్ కమిటీని ప్రకటించారు.బడుగు,బలహీన వర్గాలకు ఈ కమిటీలో అధిక ప్రాధాన్యత లభించింది.గతంలో ఎన్నడూ లేని విధంగా 61 శాతం బడుగు,బలహీన వర్గాల వారికి పదవులు దక్కాయి.బీసీలకు 41 శాతం,ఎస్సి 11 శాతం,ఎస్టీ 3 శాతం,మైనార్టీలకు 6 శాతం మొత్తంగా 61 శాతం పదవులు బడుగు,బలహీన వర్గాల వారికి ఇచ్చి తెలుగుదేశాన్ని మరోసారి బడుగు,బలహీన వర్గాల పార్టీగా నిలబెట్టారు అధినేత చంద్రబాబు.కమిటీ ఏర్పాటు కోసం సుదీర్ఘ కసరత్తు చేసిన అధినేత 17 నెలల పనితీరుకి పట్టం కట్టారు.వారసత్వం కంటే పనితీరుకే ప్రాధాన్యత ఇస్తూ ప్రతిపక్షంలో గళం వినిపిస్తున్న వారికి పదవులు కట్టబెట్టారు.

ఇప్పటి వరకూ పార్టీలో ఎటువంటి పదవులు లేని ఎంతో మంది కొత్త మొహాలకు రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించడం రాజకీయంగా చర్చినీయాంశం అయ్యింది.ఆనాడు ఎన్టీఆర్ వేసిన పునాది,ఆ తరువాత చంద్రబాబు రాజకీయ పరిణితి పార్టీ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగపడ్డాయి.ఇప్పుడు పార్టీని భావితరాలకు అందించాలనే ఆలోచనతో చంద్రబాబు అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.పార్టీలో సమూల మార్పులకు ప్రతిపక్షంలో ఉండటం కూడా అనుకూలించే అంశం.అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో మార్పులకు సాహసం చెయ్యరు.ఈ అంశం టిడిపి కి కలిసొచ్చింది.పార్లమెంట్ వారీగా అన్ని ప్రాంతాలకు సమానంగా అవకాశాలు కల్పించారు.గతంలో ఎప్పుడూ పదవులు దక్కని కొన్ని ప్రాంతాలను గుర్తించి మరీ పదవులు ఇవ్వడం కమిటీ ఏర్పాటు వెనుక జరిగిన కసరత్తు ని ఆవిష్కరిస్తుంది.

ఉదాహరణకు పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతానికి గతంలో ఎప్పుడూ పదవులు దక్కలేదు కానీ ఈసారి ప్రకటించిన కమిటీలో పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో ఉన్న నాయకుల్ని గుర్తించి పదవులు ఇచ్చారు చంద్రబాబు.ఇలా అన్ని జిల్లాల్లో గతంలో పదవులు దక్కని ప్రాంతాలను గుర్తించి మరి పదవులు కట్టబెట్టారు.రాష్ట్ర కమిటీ ఏర్పాటులో మరో విశేషం అన్ని కులాల సమతుల్యత.50 ఉపకులాలకు ఈ కమిటీలో ప్రాధాన్యత దక్కింది.శాస్త్రీయ పద్దతిలో పార్లమెంట్ పరిధిలో ఉన్న ముఖ్యమైన కులాలను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్ర కమిటీ కూర్పు జరిగింది.యువ నాయకత్వానికి పార్టీని అందించడమే లక్ష్యంగా ఎంపిక జరిగింది.

కమిటీలో ఉన్న వారి సగటు వయస్సు 48 ఏళ్ళు.మహిళలకు కమిటీలో ప్రాధాన్యత లభించింది.సిఫార్సులు,ఒత్తిళ్ళకు లొంగకుండా కేవలం పార్టీకి జవసత్వాలు తీసుకురావడమే లక్ష్యంగా కమిటీ ని ఏర్పాటు చేసారు.పనితీరు,అన్ని ప్రాంతాలు,అన్ని కులాల సమతుల్యతే టిడిపి ఏపీ రాష్ట్ర కమిటీ అంటుంది పార్టీ.పార్లమెంట్ పార్టీ ప్రాతిపదికగా కమిటీ ఏర్పాటు చెయ్యడంతో ఈ సారి పదవులు కూడా పెరిగాయి.219 మందితో ఏర్పాటైన కమిటీలో ఉపాధ్యక్షులు 18 మంది,ప్రధాన కార్యదర్శులు 16 మంది,అధికార ప్రతినిధులు 18,కార్యనిర్వాహక కార్యదర్శులు 58 మంది,రాష్ట్ర కార్యదర్శులు 108 మంది,కోశాధికారి 1 మొత్తంగా 219 మందితో కమిటీని ప్రకటించారు.ప్రతిపక్షంగా ప్రజల ప్రక్షాన పోరాటం చెయ్యడంలో ముందుండే వారితో కమిటీ ఏర్పాటు చేసారు.తిరిగి అధికారంలోకి రావడానికి నూతన కమిటీ ఎంతగానో ఉపయోగపడుతుంది అని పార్టీ బలంగా విశ్వసిస్తుంది.

రాష్ట్ర కమిటీలో బడుగు, బలహీన, ఎస్సీలకు 61 శాతం పదవులు - బీసీలకు 41 శాతం పదవులు - టీడీపీ రాష్ట్ర కమిటీలో 50 ఉప కులాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రకటన

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు : నిమ్మల కిష్టప్ప, ప్రత్తిపాటు పుల్లారావు, జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యానందరావ్, పరసరత్నం, దాట్ల సుబ్బరాజు, పిడతల సాయికల్పనరెడ్డి, బూరగడ్డ వేదవ్యాస్, సుజయ్ కృష్ణ రంగారావు, బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, వైవీబీ రాజేంద్రప్రసాద్, జి.తిప్పేస్వామి, వి.హనుమంతరాయచౌదరి, పుత్తా నరసింహారెడ్డి, దామచర్ల జనార్ధన్ రావు, శ్రీధర కృష్ణారెడ్డి, వేమూరి ఆనందసూర్య
టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శులు : పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, దేవినేని ఉమ, ఎన్.అమర్నాథ్ రెడ్డి, భూమా అఖిలప్రియ, ఎండీ నజీర్, డోలా బాలవీరాంజనేయస్వామి, బీటీ నాయుడు, గన్ని కృష్ణ, పంచుమర్తి అనురాధ, బత్యాల చెంగల్రాయుడు, గౌతు శిరీష, దువ్వారపు రామారావు, బుద్ధా వెంకన్న, చింతకాయల విజయ్, మద్దిపాటి వెంకటరాజు

టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నల్లారి కిషోర్‍ కుమార్ రెడ్డి

టీడీపీ రాష్ట్ర అధికారప్రతినిధులు : గౌనివారి శ్రీనివాసులు, ద్వారాపురెడ్డి జగదీష్, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, గూడూరి ఎరిక్షన్ బాబు, పరిటాల శ్రీరామ్, కాకి గోవిందరెడ్డి, నాగుల్ మీరా, గొట్టిపాటి వెంకటరామకృష్ణ ప్రసాద్, ఆనం వెంకటరమణ రెడ్డి, గంజి చిరంజీవులు, రుద్రరాజు పద్మరాజు, పిల్లి మాణిక్యాలరావు, మద్దిపట్ల సూర్యప్రకాష్, డా.సప్తగిరి ప్రసాద్, మొకా ఆనంద్ సాగర్, దివ్యవాణి, డా.ఎన్.బి.సుధాకర్ రెడ్డి, సయ్యద్ రఫి
బుచ్చి రాంప్రసాద్ : అమెరికాలో చాలాకాలం పనిచేసిన బుచ్చిరాంప్రసాద్  కొద్ది సంవత్సరాల క్రితమే ఇండియాకు శాశ్వతంగా తిరిగి వచ్చేశారు. అప్పట్నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటూ తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆయనను పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమించారు. గుంటూరు కేంద్రంగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న బుచ్చి రాంప్రసాద్ కీలక పదవిలో నియమితులైన సందర్భంగా ఎన్నారైలు అతనికి శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి ఉద్యమంలోను బుచ్చి రాంప్రసాద్ క్రియాశీలకంగా పాల్గొంటున్నారు.

TDP State Committee

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.