అమరావతి పోరాటంపై సీనియర్ న్యాయవాది 'నర్రా శ్రీనివాసరావు' వెబినార్ విజయవంతం

NRI
151 సీట్లు గెలిచినా కూడా రాజ్యాంగం ఫాలో కావాలా అన్నట్టుంది జగన్ పరిపాలన. ప్రతి నిర్ణయమూ రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగానే ఉంది. చివరకు ఎవరో ఒకరు కోర్టుకుపోవడంతో అవి వీగిపోతున్నాయి. ఎన్ని సీట్లతో గెలిచినా ప్రజలకు నచ్చినట్టు చేయాలి గాని పాలకులకు నచ్చింది చేయకూడదు. ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే. దారి తప్పిన రోజు అటు రాజ్యంగం ఏర్పాటుచేసిన వ్యవస్థలు ఊరుకోవు, ప్రజలు కూడా ఊరుకోరు. దీనికి ఉదాహరణే 'అమరావతి'.
ఏపీ రాజధాని మార్చను అని అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి కాదు, విశాఖ రాజధాని అని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. కానీ దానిని తరలించడం ఆయన తరం కాలేదు. ప్రజలు పోరాట బాట పట్టారు. కోర్టులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. ఈ పోరాటంలో ప్రజలను మరింత చైతన్యవంతం చేయడానికి ఎందరో కృషిచేస్తున్నారు. వారిలో ఒకరు సీనియర్ న్యాయవాది 'నర్రా శ్రీనివాసరావు'. రాజ్యాంగానికి, న్యాయస్థానానికి ఉన్న పవర్ ను తెలుసుకుంటేనే పోరాటంలో గెలవగలం అన్నది ఆయన వివరణ.
ఆ విషయాన్ని ఫ్రీ వెబినార్ ద్వారా వివరించడానికి ఆయన ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వచ్చింది. పోరాటం ఎంత అవగాహనతో చేస్తే అంత త్వరగా అమరావతి గెలుస్తుంది. అలా గెలవాలి అంటే న్యాయపరమైన విషయాలపై, క్షేత్ర స్థాయి వాస్తవాలపై మనకు అవగాహన పట్టు ఉండాలి. పోరాటంపై పట్టుదల ఉండాలి అంటూ వెబినార్ కు హాజరైన వారికి పూర్తి స్థాయి అవగాహన కల్పించారు.జూమ్ ద్వారా జరిగిన ఈ వెబినార్ లో పలువురు ప్రముఖ ఎన్నారైలు, అనేకమంది తెలుగు ప్రజలు పాల్గొన్నారు. అమరావతి పోరాటం గురించి అనేక క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకున్నారు.
జయరామ్ కోమటి, శేషు బాబు కానూరి, బుచ్చి రామ్ ప్రసాద్, భాను ప్రసాద్ యడ్లపాటి, సాయి,రమేష్, జానకిరామ్,మనోహర్ నాయుడు, శ్రీనివాస్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు
'#ఎన్నారైస్ ఫర్ అమరావతి' మరియు 'హెల్పర్స్ ఫౌండేషన్'  ఈ వెబినార్ ఏర్పాటుచేయడంపై అందరూ హర్షం వ్యక్తంచేశారు.
కార్యక్రమ నిర్వహకులకు, హాజరైన వారికి, సహకరించిన వారికి... పోరాటంతో కలిసి నడుస్తున్నవారికి 'నర్రా శ్రీనివాసరావు' కృతజ్జతలు తెలిపారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.