జనసేనపై నాగబాబు చావు దెబ్బ !!

ఇప్పటికే GHMC లో తీసుకున్న పోటీ చేస్తానని ప్రకటించి, ఆ వెంటనే 3 మూడు రోజులు లేదు లేదు పోటీ చేయం అంటూ పవన్ కళ్యాణ్ తీసుకున్న యు టర్నుతో బజారున పడింది జనసేన పరువు. అలాంటి సందర్భంలో పవన్ అన్న, నరసాపురం అభ్యర్థి నాగబాబు జనసేనను చావు దెబ్బ తీశాడు. మొన్నటి పవన్ పనికే జనసైనికులకు తలకొట్టేసినట్టయ్యింది. కానీ నాగబాబు చేసిన పనికి వారు ఇక నాగబాబుపై విమర్శల దాడి చేస్తున్నారు. ఇంతకీ నాగబాబు ఏం చేశాడు?
ఈరోజు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి... పలు వర్గాలకు వరాలు ప్రకటించారు. హైదరాబాదులో ప్రభావితం చేసే సెలూన్లకు, దోబీలకు ఉచిత కరెంటు ఇస్తాను అని చెప్పిన కేసీఆర్ అత్యధికంగా ఉండే సినిమా పరిశ్రమకు కొన్ని వరాలు ప్రకటించారు. కార్మికులకు రేషన్ కార్డులు, థియేటర్లలో అదనపు షోలు వాటిలో కొన్ని. కేసీఆర్ ఇలా ప్రకటించాడో లేదో వెంటనే నాగబాబు జయహో కేసీఆర్ అంటూ పొగుడుతూ ఒక లేఖ విడుదల చేశారు. కేసీఆర్ ను అంత అర్జెంటుగా పొగడాల్సిన అవసరం నాగబాబుకు లేదు. కానీ కేసీఆర్ చల్లని చూపును నాగబాబు కోరుకుంటున్నారు.
కానీ పొగిడే ముందు కనీసం ఆలోచించాలి కదా. తాను జనసేన నాయకుడు. నరసాపురం జనసేన అభ్యర్థి. పైగా జనసేన అధ్యక్షుడికి స్వయానా అన్న. జనసేన బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఒక్క ఓటు కూడా బయటకు పోకూడదు కాబట్టి పోటీ నుంచి విరమించుకున్నాను అని చెప్పారు పవన్. కానీ ఆయన ఇంట్లోని ఓటే పక్కకు పోయింది.
స్వయంగా అన్నే కేసీఆర్ ని ఆకాశానికి ఎత్తి టీఆర్ఎస్ ని పొగిడితే పవన్ అభిమానులు బీజేపీకి ఓటేయాలా? తాను ఇలా చేయడం వల్ల పవన్ కి ఎంత అవమానమో ఒక క్షణం కూడా నాగబాబు ఆలోచించలేదు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది?ఆ కుటుంబం లో ఒక్కోరు ఒక్కో దారిలో పోతే ఎపుడు ఆ పార్టీ ఎదిగేది. ఎపుడు పవన్ ను జనం నమ్మేది. కనీసం జనసేనకు రాజీనామా అయినా చేసి నాగబాబు ఆ లేఖ రాయాల్సింది. కానీ అలా కూడా చేయలేదు. ఇపుడు పవన్ పరిస్థితి ఏంటి. ఇంట్లోనే జనసేనకు ఆదరణ లేకపోతే సమాజంలో ఉంటుందా?
ఇది నాగబాబు ట్వీట్
nagababu praising kcr even after janasena supports bjp
nagababu praising kcr even after janasena supports bjp

కింద జనసేన అభిమానుల ఘాటు రియాక్షన్ చూడొచ్చు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.