కులం మీద చిమ్మిన "న్యాయవ్యవస్థ విషం"

"చంద్రబాబు తనకు అనుకూలురైనవారిని, కమ్మ కులస్తులను న్యాయవ్యవస్థలో చొప్పించి, కోర్టుల్ని ప్రభావితం చేసాడు, చేస్తుంటాడు". గత పాతికేళ్ళుగా సాగిన ఒక దిక్కుమాలిన విషప్రచారం ఇది. వైయెస్సార్ మొదలుపెడితే, నేటికీ సాక్షి, కొందరు కులపెద్దలు కొనసాగిస్తున్న అత్యంత హేయమైన వ్యక్తిత్వ హననం ఇది. చంద్రబాబుని, టీడీపీని, కమ్మకులాన్ని నిరంతరం దోషులుగా చిత్రీకరించే కుట్ర ఇది. అసలు ఏకంగా న్యాయవ్యవస్థకే కులగజ్జిని, కళంకాన్ని ఆపాదించే విషప్రచారం. ఇది చూస్తూ కూడా కోర్టులు ఎలా మిన్నకున్నాయనేది అంతుపట్టని విషయం.  ఒకసారి లెక్కలు చూద్దాం.

ఉమ్మడి ఏపీ హైకోర్టు ఏర్పడ్డ కాలంనుండి 1985 వరకూ, తెలుగువారే ఎక్కువగా ప్రధానన్యాయమూర్తులయ్యారు. 1985 తర్వాత ఇంతవరకూ ఏపీ హైకోర్టుకు తెలుగువ్యక్తి చీఫ్ జస్టిస్ అవలేదు.  1985 కు ముందు మొత్తం 17 మంది (తెలుగువారు + ఇతరులు) చీఫ్ జస్టిసులుగా నియమితులయితే అందులో ఐదుమంది రెడ్డి కులస్తులు. అంటే ప్రతి ముగ్గురు చీఫ్ జస్టిసుల్లో ఒకరు రెడ్డి. ఈ ఐదుగురూ గొప్ప న్యాయకోవిదులు. కొందరు మానవతావాదులు. రాజ్యాంగ నిపుణులు, చరిత్రాత్మకమైన తీర్పులు వెలువరించినవారున్నారు.

మరి వీరు కూడా తమ ప్రతిభాసామర్ధ్యాల వలన కాకుండా వేరే కారణాలతో ఉన్నతస్థానాలు సాధించారు అని కులపత్రిక మాదిరిగా బురద వేస్తే, వక్రీకరిస్తే అది సబబేనా ? ఈ ఐదుగురు చీఫ్ జస్టిసులుగా నియమితులైన కాలంలోనే రాష్ట్రానికి ఐదుగురు రెడ్లు ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఇది కూడా ఒక "ఫ్యాక్టర్" కింద ఆపాదించి మాట్లాడితే సమాజం అంగీకరిస్తుందా ? రెడ్డి సోదరులు ఒప్పుకుంటారా ? చంద్రబాబు మీద, కమ్మ కులం మీద చిమ్మిన "న్యాయవ్యవస్థ విషం" నిజమయితే ఇదీ నిజమే అవ్వాలి కదా ?

పైగా కాంగ్రెస్ హయాంలోనే జస్టిస్ ఆవుల సాంబశివరావు, జస్టిస్ చల్లా కొండయ్య వంటి కమ్మకులస్తులు చీఫ్ జస్టిసులయ్యారు. దాన్నెలా చూడాలి మరి ?

ఇక హైకోర్టు న్యాయమూర్తుల్ని చూసుకుంటే, ప్రస్తుతం ఉన్నవారు కాకుండా ఇప్పటివరకూ 177 మంది జడ్జీలు నియమితులయ్యారు. ఇందులో 32 మంది రెడ్లే. అంటే ప్రతి ఆరుగురిలో ఒక జస్టిస్ రెడ్డే. ఈ జడ్జీల్లో కూడా అనేకమంది చిరస్థాయిగా నిలిచిపోయే సేవలు అందించారు. ప్రజల హక్కుల పరిరక్షణకు దోహదపడే తీర్పులిచ్చారు. మరి వీరి శక్తిసామర్ధ్యాల ఫలితంగా ఎదిగారు అనకుండా ఎవరైనా కులాన్ని ఆపాదించి విషప్రచారం చేస్తే అది నీతిబాహ్యమైన చర్య అవదా ? సిఎంగా చంద్రబాబు కమ్మవారిని చొప్పించాడు అనేది నిజం అయితే, అంతకుముందున్న రెడ్డి సిఎంలు ఇంతమందిని చొప్పించారు అనేది కూడా నిజమేనని ఎవడన్నా ఆరోపిస్తే అది సబబేనా ?

ఇంకో పచ్చి నిజం. 32 రెడ్డి హైకోర్టు న్యాయమూర్తుల్లో  పదిమంది చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు జడ్జీలుగా నియమితులయ్యారు. కింద జతపరచిన ఆధారాలను చూడండి. ఇవన్నీ కోర్టు రికార్డులద్వారా సేకరించినవి. ఈ ఒక్క వాస్తవం చాలు, చంద్రబాబు మీద, కమ్మకులం మీద చేసిన ప్రాపగాండాలో నిజమెంతుందో తెలియడానికి. ఇకనైనా కళ్ళు తెరవండి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.