సిఎం కార్యాలయానికి ఎంటి.కృష్ణబాబు..?

ముఖ్యమంత్రి కార్యాలయ ఇంఛార్జి అధికారి బాధ్యతలతో పాటు జిఎడి పొలిటికల్‍ శాఖాదిపతిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్‍ ప్రకాష్‍ను తప్పించి ఆర్దిక శాఖాదిపతి ఎస్‍ఎస్‍.రావత్‍ను ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి తన కార్యాలయంలో నియమించుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ.. రావత్‍ నియామకం విషయంలో సిఎం జగన్‍ రెడ్డి మనసు మార్చుకున్నారని.. రోడ్లు, భవనాల శాఖాదిపతి మరియు ఏపీఎస్‍ఆర్టీసి ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంటి.కృష్ణబాబును సిఎంవోలో నియమించుకోవాలని.. ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కృష్ణబాబు గతంలో కడప జాయింట్‍ కలెక్టర్‍గా బాధ్యతలు నిర్వహించటం గమనించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‍.రాజశేఖరరెడ్డి  ముఖ్యమంత్రి అయ్యాక కడప జిల్లా కలెక్టర్‍గా నియమించుకున్నారు. వైఎస్‍ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కృష్ణబాబును సిఎంవోలో నియమించుకుంటే.. ఇప్పటికే చంద్రబాబు సామాజికవర్గంలో ఉన్న తీవ్ర వ్యతిరేకతను కొంత వరకు తగ్గించుకోవచ్చని సిఎం జగన్‍ రెడ్డి భావిస్తున్నారని ప్రచారం జరిగింది.

కృష్ణబాబు కమ్మ సామాజికవర్గానికి చెందిన ఐఎఎస్‍ అధికారి అయినప్పటికీ..ఆయన అంటే చంద్రబాబుకు ఇష్టం లేదని.. కృష్ణబాబు వైఎస్‍ కుటుంబానికి ఆప్తుడు, వీర విధేయుడని చంద్రబాబు భావించే వారని అధికారులు అంటున్నారు. విశాఖ పోర్టు ట్రస్టు ఛైర్మన్‍గా ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించిన కృష్ణబాబు తన పదవి కాలం పూర్తయ్యాక మళ్లీ రాష్ట్ర సర్వీసులో చేరేందుకు వచ్చిన సమయంలో జగన్‍ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనను వెంటనే అత్యంత ప్రాధాన్యతగల రోడ్లు, భవనాల శాఖాదిపతిగా నియమించటమే కాకుండా ఇటీవల ఆర్టీసి ఎండీగా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి. గతంలో మంత్రి వర్గ సమావేశం జరిగినప్పుడు కృష్ణబాబును పలువురు మంత్రులకు జగన్‍ ఏ విధంగా పరిచయం చేశారంటే.. ఇలాంటి సమర్దుడైన అధికారిని ఇంతకు ముందు మీరు చూసి ఉండరు. ఆయన సేవలను మన ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నామని అన్నారు. అప్పట్లోనే కృష్ణబాబును సిఎంవోలో నియమించుకుంటారని ప్రచారం జరిగింది.ఆ ప్రచారం రేపో..మాపో.. కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి. దీనిని బట్టి సీనియర్‍ ఐఎఎస్‍ అధికారి కృష్ణబాబును సిఎం జగన్‍ రెడ్డి సిఎంవో ఇంఛార్జిగా నియమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు చెప్పుకుంటున్నారు

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.