పవన్ కు ‘కిచ్చ’ సుదీప్ గిఫ్ట్... ఏంటంటే

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంతకాలంగా ఫాం హౌస్, ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. చాతుర్మాస దీక్షను ఆచరిస్తున్న పవన్ ....ఈ మధ్య కాలంలో పెద్దగా ఎవరినీ కలవలేదు. అడపా దడపా ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చిన పవన్....త్వరలోనే షూటింగుల కోసం అడుగు బయటపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ను ప్రముఖ కన్నడ నటుడు `కిచ్చ`సుదీప్ కలిశారు.

హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ కార్యాలయానికివెళ్లిన సుదీప్ కొన్ని మొక్కలను కూడా బహూకరించారు. సుమారు గంటసేపు వీరిద్దరూ చర్చించుకున్నారు. అయితే, పవన్ ను సుదీప్ కేవలం మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలుస్తోంది. సినిమాల విడుదల, థియేటర్ల పరిస్థితిపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ వంటి హుందాగల వ్యక్తిని కలుసుకున్నందుక సంతోషంగా ఉందని సుదీప్ ట్వీట్ చేశాడు. పవన్ తో దిగిన ఫొటోలను కూడా పోస్ట్ చేశాడు.  

ఈ ఇద్దరు అగ్ర నటులు దాదాపు గంటసేపు చర్చించుకోవడంతో ఏం మాట్లాడుకున్నారా అన్న చర్చ టాలీవుడ్ లో నడుస్తోంది. అయితే, ఏదైనా సినిమా విషయంలో వీరు చర్చించుకొని ఉంటారన్న టాక్ వస్తోంది. మరోవైపు, అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ కాబోతున్నాయి. దీంతో, సినిమా షూటింగులు, విడుదల....ఇండస్ట్రీ ఎదుర్కొంటోన్న ఇబ్బందులు వంటి విషయాలపైనే వీరు చర్చించుకుని ఉంటారని తెలుస్తోంది.

కోవిడ్ నిబంధనల ప్రకారం షూటింగులు నిర్వహించడంపై పవన్ కు సుదీప్ వివరించారట. ఆల్రెడీ సుదీప్ కోవిడ్ నిబంధనల ప్రకారం ఓ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారు. దీంతోపాటు, .సగం సీటింగ్ తో థియేటర్ల పరిస్థితి ఎలా ఉండబోతోందన్న అంశంపై కూడా వీరు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. వీటితోపాటు వర్తమాన, సామాజిక అంశాలపై వారు చర్చించారని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య రాజకీయాల చర్చ వచ్చిందన ప్రచారాన్ని జనసేన వర్గాలు ఖండించాయి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.