కేసీఆర్ రాంగ్ డెసిషన్ ?

పథకాల ద్వారా ప్రభుత్వ డబ్బులను పంచితే జనం సంతోషిస్తారు. అందులో అనుమానం లేదు. కానీ అవే పథకాలతో ప్రజలను మన గాట్లో కట్టేసుకోవచ్చు అనుకుంటే మత్రం ఇత్తడైపోతుంది. తాజాగా హైదరాబాదులో కేసీఆర్ పరిస్థితి, ఏపీలో జగన్ పరిస్థితి అదే.

కడుపులో కూడు కదలకుండా ఉన్నపుడు సరదాగా ఏదో ఒక పథకం ద్వారా ఏడాదికి 10 వేలో, 20 వేలో ఇస్తే తీస్కుంటారు. కానీ వాస్తవానికి తమకు కష్టం వచ్చినపుడు మాత్రం ప్రజలు ఇలాంటి వాటికి కక్కుర్తి పడి ప్రభుత్వ పొరపాట్లను క్షమిస్తారు అనుకుంటే అది బిగ్ మిస్టేక్.

దీనికి తాజా ఉదాహరణ కేసీఆర్. హైదరాబాదులో నీట మునగని... గట్టున ఉన్న ప్రజలకు, వరద నీటిలో మునిగిన వారి కష్టాలు తెలియడం లేదు. అర్థం కావడం లేదు. అందులో పెద్ద విచిత్రం లేదు. కానీ ఆ కష్టాల స్థాయి ఏంటో కేసీఆర్ కి అర్థం కాకపోవడమే విచిత్రం. బురద నీరు ఇంట్లో చేరి వారం అయినా బయటకు పోని పరిస్థితుల్లో వారి కష్టాన్ని తొలగించడం పోయి రూ.10 వేలు పంచి పండగ చేసుకోండి అనడంతో వారికి ఎక్కడ లేని కోపం వచ్చింది.

వరద నీటిలో మునిగిన వారి కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా?బయటకు పోలేరు, రాలేరు. ఎక్కడా పడుకోలేరు. ఇంట్లో ప్రతి వస్తువు డ్రైనేజీ నీటిలో తడవడం వల్ల పనికిరాదు.ఎన్నో కీలక పత్రాలు పాడైపోతాయి

వీటన్నింటికి మించి బాత్రూమ్ పోదామంటే అవకాశం లేని అత్యంత విచారకరమైన శోచనీయమైన పరిస్థితి. ఇది కింది ఫ్లోర్ వారికే కాదు, డ్రైనేజీ నీరు ఇళ్లలోకి వచ్చిన ప్రాంతాల్లో ఏ ఫ్లోర్లో ఉండేవారి ఇంట్లోను బాత్ రూం పనిచేయదు. ఆ దుస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా?

కుళాయి లేని ఇంట్లో ఉంటే ఎక్కడో 10 బకెట్లు కొనుక్కుని కాపురం నెట్టొచ్చు. కానీ డ్రైనేజీ పనిచేయని ఇంటిని అద్దెలేకుండా ఉచితంగా ఇద్దామన్నా ఎవరూ తీసుకోరు. మనిషికి గాలి పీల్చడం అనేది ఎంత ప్రధానమో కాలకృత్యాలు సక్రమంగా తీరడం కూడా అంతే ప్రధానం.

చంద్రబాబు ఎందుకు క్రైసిస్ మేనేజ్ మెంట్ ఎందుకు చేస్తారో తెలుసా... ప్రజలకు కావల్సింది ఆ సమయంలో డబ్బు కాదు. కష్టం నుంచి గట్టెక్కడం. ఎంబారసింగ్ నుంచి బయటకు రావడం. అందుకే హుదూద్ వస్తే... డబ్బులు మొహాన పడేసి మీ సావు మీరు సావండి అనలేదు. 3 రోజుల్లో అన్నీ క్లియర్ చేసి పడేశాడు. మొత్తం సెట్టయ్యిపోయింది. ఎంత కసి అంటే... హుదూద్ అనంతరం వైజాగ్ మునుపటి కంటే బాగుండాలని వేటాడి పనిచేయించాడు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాలను వంద శాతం వాడుకోవడంలో చంద్రబాబుకి చేతనైనట్లు ఎవరికీ కాదు. చంద్రబాబును చరిత్ర ఎలా గుర్తుపెట్టుకుంటుందో చెప్పడానికి... ఒక సోషల్ మీడియా పోస్టును చూద్దాం.

ఏ మాటకు ఆ మాటే... . . ఈ స్థితిలో చంద్రబాబు ఉండి ఉంటే... ఒక్కొక్కడినీ పరుగులు తీయించేవాడు... ghmc, పవర్, పోలీస్, రెవెన్యూ, హెల్త్... ఇప్పుడు మొత్తం స్తంభించిపోయింది...

Posted by Srinivasa Rao Manchala on Wednesday, October 14, 2020

తాజాగా కేసీఆర్ ఈ డబ్బులు ప్రకటించకుండా... వేగంగా వారిని గట్టెక్కించడం పట్ల దృష్టి పెట్టి ఉండాల్సింది. కానీ ఆ పనిచేయకుండా డబ్బులిస్తాం అనడం కేసీఆర్ ఇంతవరకు ఇచ్చిన వాటిలో అతిచెత్త ప్రామిస్ గా నిలిచిపోయింది. ఎన్నికలు వస్తున్నాయి కదా ప్రజలను మంచి చేసుకుందామన్న కేసీఆర్ నిర్ణయం బూమెరాంగ్ అవుతోంది.

ఈ ఫొటోల్లో వారి కష్టాలు చూశారు కదా. 10 వేలు సర్కారు ఇచ్చినందుకు వారు పడిన దుర్భరమైనకష్టం మరిచి పోగలరా మీరే చెప్పండి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.