జ‌గ‌న్ క‌న్ను.. శ్రీవారిపై ప‌డిందా? ఖ‌జానా కోసం కొత్త ఎత్తు!

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ క‌న్ను.. ఇప్పుడు తిరుమ‌ల‌పై ప‌డిందా?  అలివి మాలిన ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేర్చేందుకు ఇప్ప‌టికే ఉన్న‌ది.. అప్పులుగా తెచ్చుకున్న‌ది కూడా క‌రిగిపోవ‌డంతో...  భ‌క్తుల విరాళాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్న శ్రీవారి ఖ‌జానాను త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం వినియోగించుకునేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారా?  కోనేటి రాయుడికి రాష్ట్ర‌, దేశ‌, విదేశాల భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల‌ను త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం.. త‌న రాజ‌కీయ స్వార్థం కోసం వినియోగించుకునేందుకు జ‌గ‌న్ పావులు క‌దుపుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు కొంద‌రు అధికారులు.

అంతా హార‌తి కర్పూర‌మే!
సీఎంగా ఎలాగైనా అధికారం ద‌క్కించుకోవాల‌నే దుగ్ధ‌తో ప్ర‌జ‌ల‌కు అలివికాని హామీల‌ను ఎన్నో కుమ్మ‌రించారు జ‌గ‌న్‌. అమ్మ ఒడి.. రైతు భ‌రోసా.. వాహ‌న మిత్ర‌, జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌.. ఇలా ఒక‌టికాదు.. చాలానే ప‌థ‌కాలు వేల కోట్ల‌తో ముడిప‌డి ఉన్నాయి. దీంతో రాష్ట్రానికి ఎంత ఆదాయం వ‌చ్చినా.. హార‌తి క‌ర్పూరం మాదిరిగా క‌రిగిపోతోంది. దీంతో ఇప్ప‌టికే ఐదేళ్ల‌లో చేయాల్సిన అప్పును చేసేశారు. నిజానికి అప్పుల కోసం ఎంత‌కైనా బ‌రితెగించేందుకు కూడా స‌ర్కారు సిద్ధంగా ఉంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మేం అప్పులు తెచ్చుకునేందుకు ఓకే చెబుతాం. మీరు ఇలా చేయండి!-అని కేంద్రం అన‌గానే ఏపీ స‌ర్కారు తు.చ‌.త‌ప్ప‌కుండా చేసేసింది. అప్పులు తెచ్చేసింది.

మితిమీరిన అరాచ‌కం!
ఎన్ని అప్పులు తెచ్చినా.. ప‌థ‌కాల‌కుస‌రిపోవ‌డంలేదు. అంతేకాదు.. సీఎంగారి పాల‌న పుణ్య‌మా అని.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప్ర‌తి నెల 1వ తారీకు జీతాలు అందుతాయో లేదో చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో మ‌రిన్ని అప్పులు తెచ్చుకోక త‌ప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలో ఆయ‌న తిరుమ‌ల శ్రీవారిపై ప‌డ్డారు. తిరుమ‌ల శ్రీవారికి వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ల‌కు వ‌చ్చే నెల‌లో గ‌డువు తీరుతుంది. వాటిని తిరిగి రెన్యువ‌ల్ చేయ‌డ‌మా.. లేక వేరే వాటిలో పెట్టుబ‌డులు పెట్ట‌డ‌మా? అనే విష‌యాన్ని.. జ‌గ‌న్ త‌న‌కు అనుకూలంగా వినియోగించుకున్నారు. ఈ క్ర‌మంలోనే సౌమ్యుడు, వివాద‌ర‌హితుడిగా పేరు తెచ్చుకున్న ఉత్త‌రాధికి చెందిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను సైతం రాత్రికి రాత్రి త‌ప్పించి.. త‌న‌కు అనుకూల వ్య‌క్తి.. జ‌వ‌హ‌ర్‌రెడ్డికి ప‌గ్గాలు అప్ప‌గించారు. అంటే.. అటు ఈవో.. ఇటు టీటీడీ చైర్మ‌న్ ఇద్ద‌రూ జ‌గ‌న్‌కుఅనుంగులే!

ఇక‌, శ్రీవారికే నామాలు..
త‌న బాబాయి.. టీటీడీ చైర్మ‌న్ సుబ్బారెడ్డిని వాడుకుని.. తిరుమ‌ల సొమ్మును జ‌గ‌న్‌కు కౌంక‌ర్యం చేసేలా ప‌న్నాగం ప‌న్నారు. అంటే.. తిరుమ‌ల శ్రీవారికి చెందిన వేలాది కోట్ల సొమ్ము.. జ‌గ‌న్ స‌ర్కారుకు అప్పుగా చేరిపోనుంది. కాగా, తిరుమ‌ల సొమ్మును ప్ర‌భుత్వం తీసుకుంటే.. త‌ప్పేంట‌నే ప్ర‌శ్న వ‌స్తుంది. హిందూ ధార్మిక చ‌ట్టం ప్ర‌కారం.. హిందూ దేవాల‌యాల సొమ్మును హిందూ కార్య‌క్ర‌మాలు, దేవాల‌యాల అభివృద్ధి, హిందూధ‌ర్మ ప్ర‌చారానికే వినియోగించాలి. కానీ, జ‌గ‌న్ అలా చేయ‌రుక‌దా.?  పైగా.. ఈ సొమ్మును తిరిగి ప్ర‌భుత్వం భ‌ద్రంగా శ్రీవారికి అప్ప‌జెప్పేవ‌ర‌కు గ్యారెంటీ లేదు. ఎందుకంటే.. మ‌రో మూడేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. దీంతో జ‌గ‌న్ శుభ్రంగా శ్రీవారికే నామాలు పెట్టేసినా.. పెట్టేయొచ్చ‌నేది భ‌క్తుల ఆవేద‌న‌. ఒక‌సారి చేయంటూ జారితే.. దానిి అడ్ర‌స్ ఎప్పుడో.. ఎక్క‌డో ఎవ‌రు మాత్రం చెబుతారు?

ఇంత జ‌రుగుతున్నా.. వారేం చేస్తున్నారు?
మ‌రి ఇంత జ‌రుగుతున్న టీటీడీ సొమ్మును త‌న జేబులో సొమ్ములా.. వినియోగించుకునేందుకు జ‌గ‌న్ పావులు క‌దుపుతున్నా.. ప్ర‌శ్నించేవారే లేరా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. గుడుల‌పై దాడులు జ‌రిగితేనో.. ఎవ‌రైనా వివాదాస్పద వ్యాఖ్య చేస్తోనో.. రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిపుట్టించే బీజేపీ నేత‌ల నోళ్లకు తాళాలు ప‌డ్డాయి. పైగా తిరుప‌తిలోనే ఉన్న‌ బీజేపీ నాయ‌కుడు భానుప్ర‌కాశ్‌రెడ్డి కూడా సైలెంట్ అయ్యారు. ఇక‌, ఏపీ క‌మ‌ల సార‌థి సోము వీర్రాజుమ‌రింత మౌనం.. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. హిందూ ధార్మిక సంస్థ‌లుకానీ, తిరుమ‌ల‌లో చీమ చిటుక్కుమ‌న్నా.. ప‌దే ప‌దే ప్ర‌చారం చేసే కొన్ని టీవీ ఛానెళ్లు కానీ.. ఇప్పుడు ఏం చేస్తున్నాయ‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

రాజ గురువు.. స్వ‌రూపానంద‌కు ప‌ట్ట‌దా?
జ‌గ‌న్‌కు రాజ‌గురువుగా పేరు తెచ్చుకున్న విశాఖ శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర సైతం టీటీడీ నిధుల‌కు జ‌గ‌న్ ఇంత పెద్ద ఎస‌రు పెడుతున్నా.. పన్నెత్తు మాట మాట్లాడ‌లేదు. పైగా ఆయ‌నకు చీమ‌కుట్టిన‌ట్టు కూడా లేదు. నిజానికి ఆయ‌న జ‌గ‌న్‌కు అన్ని విధాలా స‌ల‌హాలు ఇస్తుంటార‌ని అంటారు. మ‌రి ఇంత పెద్ద విష‌యంలో జ‌గ‌న్ .. ఆయ‌న‌ను సంప్ర‌దించే చేశారా?  అలా అయితే.. స్వ‌రూపానందేంద్రే తీసుకోమ‌ని స‌ల‌హా ఇచ్చారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. పోనీ.. ఆయ‌న‌ను సంప్ర‌దించ‌కుండా ఎస‌రు పెట్టాల‌ని అనుకుంటే.. స్వామి ఎందుకు మౌనం వ‌హించారు. దులిపేయాలి క‌దా!! ఇవ‌న్నీ ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చిన ప్ర‌శ్న‌లు.. మ‌రో‌వైపు దేవ‌దాయ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ క‌రోనాతో హైద‌రాబాద్‌లో ఉన్నారు. వైవీ సుబ్బారెడ్డిదీ అదేప‌రిస్థితి .. ఇక‌, ఈ విష‌యంలో మాట్లాడెద‌వ‌రు.. గోవిందా.. గోవిందా!!!

TTD Status report on Investments

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.