ఈ ఫొటోలో ఒక తమాషా ఉంది

అరె... ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఫొటోను పట్టుకుని తమాషా అంటావేంటి అనుకుంటారేమో. ఒక్కసారి జగన్ గత ఢిల్లీ టూర్ వెళ్లి వచ్చాక ఎయిర్ పోర్ట్ సీన్ గుర్తుకుతెచ్చుకోండి. మీకు గుర్తుకురాకపోతే కింద వీడియో చూడండి.

చూశారుగా... ఇపుడు ఈరోజు జగన్ ఢిల్లీలో దిగిన ఫొటో చూడండి. సీఎం జగన్ రెడ్డి... తనకంటే తక్కువ స్థాయి వారితోనేమో మాస్కుల మీద సెటైర్ వేసి తీయవయ్యా మాస్కు, ఫొటోలు దిగేటపుడు మాస్కేసుకుని ఫొటో దిగుతావా అంటూ ఎటకారం ఆడి...స్వయంగా సీఎం కోవిడ్ నిబంధనను వ్యతిరేకించి, ఉల్లంఘించారు.

AndhraPradesh CM Jagan Reddy and Rajyasabha floor ysrcp leader Saireddy meets PM Narendra modi

పై ఫొటో చూశారుగా. తన కంటే పెద్దోడు, దేశానికి పీఎం కాబట్టి మాస్కు వేసుకుని ఫొటో దిగారు జగన్ రెడ్డి. మరి... ఇక్కడ ఫొటోకి మాస్క్ అడ్డం రాదా? ఇక్కడ మాస్కుతో ఫొటోదిగితే ఓకేనా? ఏపీలో నేనే సింహం కానీ... పీఎం ఎలా చెబితే అలా వింటాను, అతనంటే నాకు భయం అన్నట్టే కదా. అదే మర్యాద, అదే మాస్కు నిబంధన రేణిగుంట విమానాశ్రయంలో ఎందుకు ఫాలో కాలేదు. తన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఏమన్నా చెల్లిపోతుంది. ఇక్కడ పప్పులు ఉడకవు కాబట్టి మాస్క్ పెట్టుకుంటారా?

ధైర్య, సాహసాలు అనేవి పర్మనెంట్ లక్షణాలు. అవి మనిషిలో నిజంగా ఉంటే ఎక్కడైనా ఉండాలి. ఏం జర్నలిస్టువయ్యా నువ్వు నిబంధన పాటించినందుకు, ప్రధానిని గౌరవించినందుకు తప్పుపడతావా? అంటారా... మేము కూడా అదే అడుగుతున్నాం. బియ్యపు మధుసూదన్ రెడ్డి మాస్కు పెట్టుకొచ్చినందుకు జగన్ తిడతాడా? తీసేయమంటాడా? అని... !

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.