హథ్రాస్ : రాహుల్ తో ఇండియా !

హథ్రాస్ ఘటన దేశాన్ని విస్తుపోయేలా చేసింది. నిందితులను ఎన్ కౌంటర్ చేయాల్సిన యోగి ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి వేధింపులు రావడం అత్యంత ఆశ్చర్యాన్ని, దేశానికే విస్మయాన్ని కలగజేసింది.

కుటుంబసభ్యులను అంత్యక్రియలకు ప్రత్యేక శ్రద్ధతో తీసుకువెళ్లాల్సిన ఘటన ఇది. కానీ అత్యాచార బాధితురాలి మృతదేహాన్ని కూడా బంధువులకు ఇవ్వకుండా, వారిని కిడ్నాప్ చేసినట్లు గదిలో ఉంచి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడం వైరల్ అయ్యింది.

దీంతో దేశం దీనిపై తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. యోగి సర్కారు తీరుపై కాంగ్రెస్ తో పాటు అనేక రాజకీయ రాజకీయ పక్షాలు దండెత్తాయి. బాధితులను పరామర్శించడానికి ప్రయత్నించిన రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని పోలీసులు గాయపరచడం దేశ ప్రజలకు కోపం తెప్పించింది. పోలీసులు ఏ తప్పు చేయకపోతే ఎందుకు రాహుల్ ని అడ్డుకుంటున్నారు అంటూ యోగి సర్కారును దేశ ప్రజలు నిలదీస్తున్నారు.

హథ్రాస్ ఘటనతో దేశ ప్రజలంతా రాహుల్ గాంధీకి మద్దతు పలికారు. కింద పడితే పడ్డాడు గాని రాహుల్ గాంధీ సమస్యల వెంట పయనిస్తున్న నాయకుడిగా నిరూపించింది. ప్రజల్లో ఉండటానికి రాహుల్ వెనుకాడడు అని ప్రూవ్ చేసింది. ఇది బీజేపీకి ఆందోళన కలిగించడంతో సాయంత్రానికి మనసు మార్చుకున్న బీజేపీ ఈ ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.

దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై రాహుల్ పై జనం స్పందన ఇలా ఉంది.

నాడు బాధితురాలు ద్రౌపది...రథసారథి శ్రీకృష్ణుడు, అర్జునుడు, కౌరవుల అంతం... నేడు బాధితురాలు మనీషా... రథసారథి ప్రియాంక,రాహుల్ గాంధీ, బీజేపీ కౌరవ సేన అంతం.

Posted by Raju Arige on Saturday, October 3, 2020

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.