ఏపీ మంత్రి బ్యాటింగ్-హీరోయిన్ ఫిదా

రాజకీయ నేతల మీద కొందరికి ఉండే దురభిప్రాయాలు అన్ని ఇన్ని కావు. నేతలన్న వారు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతారని భావిస్తారు. కానీ.. తరం మారింది. కొత్త రక్తం రాజకీయాల్లోకి వచ్చేసిందన్న విషయం ఇటీవల తరచూ స్పష్టమవుతోంది. మొన్నటికి మొన్న తెలంగాణలోని సిద్దిపేటలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో బ్యాట్ తో వీరవిహారం చేసిన మంత్రి హరీశ్ రావు.. ప్రొఫెషనల్ ఆటగాడిని తలపించారు. ఆయన బ్యాట్ పట్టిన తీరుకు.. నియోజకవర్గ ప్రజలు తెగ ఎంజాయ్ చేశారు. ఆయన ఆట తీరుకుచాలామంది ఫిదా అయ్యారు.

తాజాగా అలాంటి సీన్ ఏపీలో రిపీట్ అయ్యింది. నిత్యం ఊపిరిసలపని కార్యక్రమాల్లో బిజీగా ఉండే మంత్రి అనిల్ కుమార్.. ఈ రోజు అందుకు భిన్నంగా క్రికెట్ ఆడి అలరించారు. రాజమహేంద్రపురంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కూడా హాజరయ్యారు. ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి.

ఆదివారం నుంచి మొదలైన ఈ పోటీలు డిసెంబరు 31 వరకు సాగనున్నాయి. 18 రోజులపాటు మొత్తం 74 మ్యాచులు నిర్వహించనున్నారు. క్రికెట్ టోర్నీని ప్రారంభించిన సందర్భంగా మంత్రి అనిల్ కాసేపు సరదాగా బ్యాట్ పట్టారు. కుర్రాళ్లు బౌల్ చేస్తే.. ప్రొఫెషనల్ క్రీడాకారుడిమాదిరి క్రీజ్ ముందుకు వచ్చి షాట్లు కొట్టిన తీరుకు అక్కడకు వచ్చిన వారంతా ఎంజాయ్ చేశారు. మంత్రి బ్యాటింగ్ తీరుకు స్థానికులు మాత్రమే కాదు.. నటి పాయల్ రాజ్ పుత్ సైతం ఫిదా కావటం ఆసక్తికరమని చెప్పాలి.  మంత్రిగారి క్రికెట్ ఆటకు సంబంధించిన వీడియోఇప్పుడు వైరల్ గా మారింది. మరి.. మీరూ ఒక లుక్ వేయండి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.