పార్టీ అన్యాయం చేసింది- వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం
వైసీపీలో అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో అసంతృప్తి రగులుతోంది. పార్టీ రెడ్డి సామాజిక వర్గాన్ని తప్ప మరెవరినీ పట్టించుకోవడం లేదన్న విషయం అందరికీ అర్థమైపోయింది. పార్టీకి విస్త్రృత ప్రచారం కల్పించి పార్టీకి రక్షణ కవచాల్లా నిలిచి పార్టీని నిలబెట్టుకున్న ఎస్సీలు, ఎస్టీలకు పార్టీలో న్యాయం జరగడం లేదని మళ్లీ మళ్లీ ప్రూవ్ అవుతోంది.
స్వయంగా పార్టీ నేతలపై నాయకత్వాన్ని బూతులు తిడుతున్నారు. గన్నవరంలో పార్టీ నేత జోజి బాబు పార్టీ తనకు అన్యాయం చేసిందని పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పక్కనున్న వారు ఆపేసి అతన్ని రక్షించారు. పార్టీకి రక్తం ధారపోసినా మమ్మల్ని పార్టీ పట్టించుకోవడం లేదని జోజిబాబు ఆరోపించారు.
ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఒక కార్యకర్త కాదు... వైసీపీ ఎస్ సి సెల్ జిల్లా కార్యదర్శి మొగిలిచర్ల జోజి బాబు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ, ఆయన అనుచరులపై తీవ్ర ఆరోపణలు చేశారు జోజిబాబు. ఇంతెందుకు మొన్న హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్వయంగా రెడ్ల ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. దీంతో పార్టీ అవాక్కయ్యింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు పార్టీ అంతర్గత గొడవలతో అసంతృప్తి పరాకాష్టకు చేరుకుంది.
కింద జోజిబాబు ఆత్మహత్యాయత్నం వీడియో చూడొచ్చు.
గన్నవరం వైసిపి నేత జోజి బాబు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం
— Sreenivas C(A+)✌️🚴 (@SreenivasC14) December 15, 2020
అడ్డుకుని నీళ్లు పోసి ఆపిన అనుయాయులు
వైసీపీ ఎస్ సి సెల్ జిల్లా కార్యదర్శి మొగిలిచర్ల జోజి బాబు
గన్నవరం ఎమ్మెల్యే వంశీ, ఆయన ప్రధాన అనుచరుడు కోట్లు పై తీవ్ర ఆరోపణలు. #JaganRowdyRajyam pic.twitter.com/NYPGIJltw7