ఆంధ్రుల సంపద - 'అమరావతి' : 20 నిజాలు

1
అమరావతికి నీటి కొరత లేదు :
కృష్ణా నది ఒడ్డున, పుష్కలమైన నీటి వసతి ఉన్నచోట రాజధానిగా అమరావతి నిర్ణయం జరిగింది
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలన్నీ నీటి కొరత ఎదుర్కొంటున్నాయి.
బెంగళూరులో నీటికొరతతో సెలవులు ఇచ్చారు.
అమరావతి కృష్ణానది ఒడ్డున ఉంది కాబట్టి నీటి సమస్య రాదు.
నీటి సమస్య లేకపోతే, ఎన్నో పరిశ్రమలు, సంస్థలు ఇటు వైపు వచ్చేవి

2
అమరావతికి ట్రాఫ్ఫిక్ సమస్య లేకుండా ప్రణాళికలు :
దేశంలోని పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది
అమరావతి మాస్టర్ ప్లాన్ తయారీ ఏవిధమైన ట్రాఫిక్ సమస్య భవిష్యత్తులో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అమరావతిలో పెట్టుబడులు పెట్టటానికి ఇదీ ఒక ప్లస్ అయ్యేది

3
పోరుగు రాష్ట్రాలకు అనుసంధానం తేలిక :
పొరుగు రాష్ట్రాలతో, దేశంలో అన్ని ప్రాంతాలకు అనుసందానిస్తూ రోడ్, రైల్, ఎయిర్, పోర్ట్ కనెక్టివిటీ అమరావతికి ఉంది.
ఏ పెట్టుబడిదారుడికైనా కావలిసింది ఇవే కదా.

4
ఉపాధి కేంద్రంగా అమరావతి ప్రణాళికలు :
13 జిల్లాలకు సంపద సృష్టికి కేంద్రంగా, ఉపాధికి కేంద్రంగా అమరావతి ప్లాన్ చేయబడింది.

5
అమరావతి మాస్టర్ ప్లాన్:
ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాధాన్యతగా, 30% పచ్చదనం-బ్లూ అండ్ గ్రీన్ సిటీగా అమరావతి నిర్మాణం ప్లాన్ చేయబడింది.

6
అమరావతిలో 9 నవనగరాల ప్రణాళికతో, రాష్ట్రం ఆర్ధికంగా నిలబడుతుంది:
ఫైనాన్స్ సిటి, అడ్మినిస్ట్రేషన్ సిటి, జస్టిస్ సిటి, నాలెడ్జ్ సిటి, మీడియా సిటి, స్పోర్ట్స్ సిటి, హెల్త్ సిటి, ఎలక్ట్రానిక్స్ సిటి, టూరిజం సిటి
నవ నగరాల నిర్మాణం జరిగితే రాష్ట్రానికి 60% ఆదాయం అమరావతి నుంచే వచ్చేది.
ఇవన్నీ నిర్మించుకునే మంచి అవకాసం వదులుకుంటున్నాం

7
సిఆర్డీఏ ద్వారా భూముల అభివృద్ధికి ప్రణాళికలు:
స్టార్టప్ ఏరియా : 1,691 ఎకరాలు
గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా : 1,575 ఎకరాలు
130 సంస్థలకు అలాట్ చేసిన భూమి : 1,293 ఎకరాలు
గన్నవరం ఎయిర్ పోర్ట్ రైతుల ప్లాట్లు : 340 ఎకరాలు
సోషల్ ఇన్ ఫ్రా అండ్ అదర్ పర్పస్ కోసం : 1,099 ఎకరాలు
భవిష్యత్తు అవసరాల కోసం ఉంచిన భూమి : 5,020 ఎకరాలు
నగరం కోసం  అందుబాటులో ఉంచింది : 3,019 ఎకరాలు
మొత్తం : 14,037 ఎకరాలు

8
స్మార్ట్ సిటీగా అమరావతికి గుర్తింపు :
రూ. 2,046 కోట్లతో 20 ప్రాజెక్టులు
ఇందులో 14 ప్రాజెక్టులను సిఆర్డిఏ ద్వారా ప్రాధమికంగా చేపట్టింది
ఇప్పటివరకు 20 ప్రాజెక్టుల మీద రూ. 745కోట్లు వ్యయం( కేంద్రం ఇచ్చింది రూ. 371కోట్లు)

9
అమరావతి తాగునీటి అవసరాల కోసం :
రాజధానిలో తాగు నీటి అవసరాల కోసం, వైకుంఠపురం రిజర్వాయర్ రూ 2,247 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు

10
రాజధానిలో 1,293 ఎకరాల్లో 130 సంస్థలకు భూములు కేటాయించారు.
అవి వస్తే, 13 జిల్లాల యువతకు, 60వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి
ఇవన్నీ ఇప్పుడు ఆగిపోయాయి

11
అమరావతిలో కార్యాలయాల కోసం, 25 భారత ప్రభుత్వ సంస్థలకు అనుమతులు ఇచ్చారు.
ఈ సంస్థలకు 192 ఎకరాల భూమి కేటాయించారు
ఇవన్నీ ఇప్పుడు ఆగిపోయాయి

12
అమరావతిలో కార్యాలయాల కోసం, 24 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థలకు అనుమతులు ఇచ్చారు.
ఈ సంస్థలకు 165 ఎకరాల భూమి కేటాయించారు
ఇవన్నీ ఇప్పుడు ఆగిపోయాయి

13
కేంద్ర ప్రభుత్వ పిఎస్ యూలు 18 యూనిట్లకు, 23 ఎకరాలు కేటాయించారు
ఇవన్నీ ఇప్పుడు ఆగిపోయాయి

14
రాష్ట్ర ప్రభుత్వ పిఎస్ యూ లు 4 యూనిట్లకు, 11.27ఎకరాలు కేటాయించారు
ఇవన్నీ ఇప్పుడు ఆగిపోయాయి

15
రాజధాని నగరం అమరావతి నిర్మాణం పూర్తయితే, వచ్చే 20 ఏళ్ళలో, ప్రైవేటు, పుబ్లిక్ సెక్టార్ లో, మొత్తం 21,46, 690 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేవి
13 జిల్లాల యువతకే కాకుండా, పక్క రాష్ట్రాలకు కూడా, ఉపాధినిచ్చే స్థాయికి అమరావతి చేరి ఉండేది

16
అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు (సింగపూర్ కన్సార్షియం) ఒప్పందం రద్దువల్ల రూ 50వేల కోట్ల పెట్టుబడులు, రెండున్నర (2.5) లక్షల ఉద్యోగాలు వెనక్కి పోయాయి.

17
రాజధాని కాంట్రాక్ట్ పనులన్నీ నిలుపుదల చేయడం వల్ల 50 వేల మంది ఉపాధి కోల్పోయారు.
కాంట్రాక్టర్లకు ప్రభుత్వంపై నమ్మకం సడలింది.

18
సైబరాబాద్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తే, 13 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి ఏర్పడింది.
తెలంగాణ ప్రభుత్వానికి 50% పైగా ఆదాయాన్ని సమకూరుస్తోంది.
సంపద సృష్టించడం అంటే ఇదే.
ఇలాంటి మంచి అవకాసం అమరావతి కోల్పోయింది

19
అమరావతి నిర్మాణం ఆపకుండా ఉండి ఉంటే,  కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, రైల్వే, విద్యా, ఆరోగ్య, ఆధ్యాత్మిక సంస్థలు వంటివి ఈ పాటికే ఇక్కడ నిర్మాణం మొదలు పెట్టేవి.
ప్రభుత్వం మారిన తరువాత, ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రానికి వచ్చిందా ?
కొత్త నగరాలతో ఉండే సౌలభ్యం అదే.
ఇవన్నీ మనం వదులుకుంటున్నాం

20
13 జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు మన అమరావతి
175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాల కల్పవల్లి అమరావతి
ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం మన ప్రజా రాజధాని
ప్రతి ఆంధ్రుడు గర్వించే ప్రపంచస్థాయి నగరం అమరావతి

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.