జగన్ పై ఢిల్లీ సీరియస్

నేను తలచుకుంటే ఏదైనా చేయగలను అనుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పని బ్యాక్ ఫైర్ అయ్యింది. ఈ దేశంలో ఏదీ ఎవరు అనుకున్నట్టు జరగదు. రాజ్యాంగంలో ఉన్నట్టే జరిగేది. ఆ విషయం అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతుందే ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో నిరూపితం అయ్యింది. ఒక రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ కే రాజ్యాంగం అంత పక్కాగా ఈ రాజకీయ నాయకుల నుంచి రక్షణ కల్పించింది అంటే...  ఒక సుప్రీంకోర్టు జడ్జికి ఎలాంటి రక్షణ కల్పించి ఉంటుందో ఊహించడం సులువే.

జగన్ లాంటి ఒక రాజకీయ నాయకుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఒక లేఖ రాసినంత మాత్రాన అతని పదవి పోతుంది అనుకోవడం అమాయకత్వం. 38 కేసుల్లో నిందితుడు అయిన జగన్ ముఖ్యమంత్రి అయినా కూడా అతను ఒక బెయిలు మీదున్న వ్యక్తి. ఏరోజు అయినా కోర్టు ఆయనను జైలుకు పంపగలదు. అలాంటి వ్యక్తి ఎటువంటి ఆరోపణలను లేని జస్టిస్ ఎన్వీ రమణపై లేఖ రాసినంత మాత్రాన ఇక ఆయన హీరో అయ్యాడు అని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారంటే వారు రాజ్యాంగం ఎంత అవగాహన లేమి ఉందో అర్థమవుతుంది.

తాజాగాఢిల్లీ నుంచి జగన్ కి గట్టి షాక్ తగలిగింది. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ జగన్ లేఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణకు వ్యతిరేకంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ రాయడాన్ని  తీవ్రంగా ఖండిస్తున్నట్టు బార్ అసోషియేషన్ పేర్కొంది. ఇది న్యాయవ్యవస్థపై పెత్తనం చెలాయించే ప్రయత్నమే అని ఖరాఖండిగా అభిప్రాయపడింది. కాబోయే సీజేఐ స్థానంలో ఉన్న జస్టిస్ రమణపై చేసిన ఆరోపణలు అసంబంధం అంటూ దుయ్యబట్టింది.

జగన్ లేఖపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్‌ రాసిన లేఖ యధాతథంగా..

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.