జగన్ మరోసారి ఏపీ పరువు తీశారు - చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

అమరావతి అభివృద్ధికి తన సొంతపొలాన్ని ఇవ్వడం అంటే... అది 5 కోట్ల ప్రజలకు ఇవ్వడం కింద లెక్క. అక్కడ అమరావతి కడితే పొలంలో ప్రతి సెంటుకు రేటు పెరుగుతుంది. కానీ రేటు పెరిగినా ఆ రైతుకి తిరిగి దక్కేది పావు వంతు మాత్రమే.

సైబరాబాదు అభివృద్ధి అయితే
మణికొండ రైతుకు
కోకాపేట రైతుకు
రాయదుర్గం రైతుకు
ఇంకా పరిసర ప్రాంతాల రైతులకు
తమ పొలంలోని ప్రతి సెంటును భారీ రేటుకు అమ్ముకునే అవకాశం వచ్చింది.

కానీ అమరావతి అభివృద్ధి అయితే అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతులకు కేవలం పావలా వంతు మాత్రమే తిరిగి దక్కింది. మిగతా 75 శాతం భూమి ప్రభుత్వానికి దఖలు పడింది.

ఇలాంటి త్యాగం దేశంలో ఏ రైతు చేయలేదు, చేయబోడు

ప్రభుత్వం రాష్ట్రం కోసం అభివృద్ధి చేసే ప్రాంతానికి తమ పొలాన్ని 75 శాతం రాసిచ్చిన వాడిది త్యాగం కాదంటే.... ప్రజల డబ్బుతో పథకాల పేరిట డబ్బులు పంచే ముఖ్యమంత్రిది గొప్ప మనసు అవుతుందా?

అలాంటి రైతుకు జగన్ సర్కారు బేడీలు వేసింది. ఈ చర్య పట్ల దేశం విస్తుపోయింది. ప్రతిపక్షాలు అధికార పార్టీ దురంహకారాన్ని నిరసించాయి. ఇది మహా తప్పిదం కింద చెబుతున్నాయి. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. వరుస ట్వీట్లు వేశారు.

రైతులకు బేడీలు వేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు మరో అప్రదిష్ట మూటగట్టారు. కేడీల రాజ్యంలో రైతులకు బేడీలా అనే చర్చకు దేశవ్యాప్తంగా తెరదీశారు. గత 17నెలలుగా రాష్ట్రంలో కన్నీళ్లు పెట్టని రైతు కుటుంబాలు లేవు. అన్నదాత కుటుంబాలను ఎందుకింత క్షోభ పెడుతున్నారు?  
మద్దతు ధర అడిగిన అన్నదాతలపై అక్రమ కేసులు, తమ భూములు లాక్కోవద్దని వేడుకున్న రైతులపై తప్పుడు కేసులు, స్వచ్ఛందంగా రాజధానికి భూములిచ్చిన రైతులపై అక్రమ కేసులు. తాను అమ్మని ధాన్యానికి  డబ్బులు తనకొద్దు అన్న నిజాయితీకి వేధింపులు...  ఏడాదిన్నరలో వేలాది రైతులపై ఇన్ని అక్రమ కేసులు ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా? దళిత రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టడం ఎక్కడైనా ఉందా..?  పురుగు మందు డబ్బాలతో దళిత మహిళలు తమ భూముల్లో పహారా తిరగడం ఎప్పుడైనా జరిగిందా..? అసైన్డ్ భూములను లాక్కుని దళిత రైతుల పొట్టగొట్టడానికా మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాళ్లావేళ్లా పడి అడిగి తీసుకుంది..? ఒక్క ఛాన్స్ ఇచ్చిన నేరానికి బీసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల ఉసురు పోసుకుంటారా? ఫిర్యాదుదారు కేసును ఉపసంహరించుకున్న తర్వాత కూడా రాజధాని రైతుల చేతులకు బేడీలు వేయడం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం.  గతంలో రైతుల కాళ్లకు బేడీలు వేసిన పాార్టీకి పట్టిన గతే వైసిపికి కూడా పడుతుంది. రైతులకు బేడీలు వేసిన వారిపై  కఠిన చర్యలు చేపట్టాలి, ఇలాంటి దుర్మార్గాలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి.

- ఇది చంద్రబాబు వ్యాఖ్య

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.