వ్యవసాయం దండగ... YS family అల్లిన అందమైన అబద్ధం

అన్నం పెట్టే రైతును తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏనాడూ చులకన చేయలేదు. అసలు రైతులకు కరవు, సాయం వరద సాయం అనే కొత్త కాన్సెప్టును వ్యవస్థీకృతం చేసింది చంద్రబాబునాయుడు. డ్రిప్ ఇరిగేషన్ విప్లవంతో రాయలసీమలోని అత్యంత కరవు జిల్లా అయిన అనంతపురం జిల్లాను భారతదేశపు పండ్ల రాజధానిగా తీర్చిదిద్దడానికి అన్నిరకాల పునాదులు వేసి రాళ్లసీమలో పళ్లు పండించిన ఘనత చంద్రబాబుది.

వ్యవసాయం ఒకవైపు, ఐటీ ఒకవైపు సమాంతరంగా నూతన విప్లవాలను తీసుకెళ్లారు. అయితే, తెలుగుదేశం నాయకుల నిర్లక్ష్యం,  నిజాలు అన్నీ ప్రజలకు కనిపిస్తున్నాయి కదా ఎవరేం అన్నా ప్రజలు పట్టించుకోరు అన్న అతినమ్మకం  వల్ల చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని ప్రచారం చేసినా నిర్లక్ష్యం చేశారు. ఒక అబద్ధాన్ని వైఎస్ కుటుంబం మొత్తం భుజం మీద మోస్తూ చంద్రబాబును రైతు వ్యతిరేకిగా చిత్రీకరించింది.

ముదిగొండలో రైతులపై బుల్లెట్లు కురిపించి ఆరుగురిని చనిపోయింది వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే. 2007లో ఖమ్మం జిల్లా ముదిగొండలో రైతుల పోరాటంపై కాల్పులు జరపగా 8 మంది రైతులు ప్రాణాలు విడిచారు. 12 మంది అంగవికలురు అయ్యారు. ఇంకా ఎంతో మంది ఆస్పత్రుల పాలయ్యారు. అలాంటి కుటుంబం బషీర్ బాగ్ లో ముగ్గురు చనిపోతే చంద్రబాబు మీద నింద వేసి తప్పించుకోవాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. బషీర్ బాగ్ పోరాటం పార్టీలు ప్రోత్సహించి రెచ్చగొట్టిన పోరాటం. కానీ ముదిగొండలో వైఎస్ హయాంలో రైతులు స్వచ్ఛందంగా తిరగబడి చేసిన పోరాటం. కనీస కనికరం లేకుండా ప్లాన్ చేసి లాఠీ ఛార్జీ, కాల్పులు చేయించారు. బాధిత రైతులకు నేటికి సరిగా సాయం అందలేదు.

వ్యవసాయం దండగ అని చంద్రబాబు మనసులో మాట పుస్తకంలో ఉందట. ఇది వైఎస్ అన్నాడు, జగన్ అన్నాడు. ఎన్నికల ప్రచారంలో ఆయన కుటుంబం మొత్తం అదే అబద్ధాన్ని పదేపదే చెప్పింది. వీళ్లెవరు ఆ పుస్తకం కూడా చదవలేదు. చివరికి మళ్లీ నిన్న మండలిలో బొత్స మాట్లాడుతూ ‘చంద్రబాబు వ్యవసాయం దండగ అని మనసులో మాట పుస్తకంలో రాసుకున్నాడు‘‘ అని మండలి సాక్షిగా అబద్ధం చెప్పాడు.
వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత పచ్చిగా అబద్ధాలు ప్రచారం చేసి తెగించారు. ఆ పుస్తకంలో ఏముందో ఈ వీడియలో చూడొచ్చు. తెలుగుదేశం ఇప్పటికైనా ఈ విషయాన్ని గట్టిగా పదేపదే తిప్పికొట్టకపోతే వైఎస్ కుటుంబం అల్లిన అబద్ధం నిజమై కూర్చుంటుంది.

ఆ పుస్తకంలో ఏముందంటే...

"ఇంట్లో ముగ్గ్గురు/నలుగురు పిల్లలు ఉంటె అందరు వ్యవసాయం చేస్తే పంచుకున్నప్పుడు కమతాలు చిన్నవి అయ్యి గిట్టుబాటు అవదు.దయ చేసి చదువుకోండి. ఇతర రంగాల వైపు మరలండి’’-  ఇవి చంద్రబాబు అన్నమాటలు

ఇదిగో మనసులో మాట పుస్తకంలో విషయాలపై పూర్తి వీడియో

లోకేష్ చేసిన ఛాలెంజ్ కూడా ఇదిగో.

కానీ వీరు ముందునుంచే ఇంత అలర్ట్ అయ్యి ఉంటే ఇంత నష్టం జరిగుండేది కాదు. రైతు బజార్ల ద్వారా, వ్యవసాయ విప్లవం ద్వారా చంద్రబాబు రైతులకు చేసిన మేలు దేశంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. అనంతపురంలో భూమి ఉన్న ప్రతి రైతు లక్షలు సంపాదిస్తున్నారు. గోదావరి జిల్లాలో ఏ రైతు కూడా పండించనంత డబ్బు సంపాదిస్తున్నాడు.

వైసీపీ వ్యక్తి అని ముద్ర పడిన జర్నలిస్ట్ సాయి మాటల్లో వ్యవసాయం గురించి చంద్రబాబు మాట్లాడింది ఏంటో విపులంగా వివరించారు.

చాలాకాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు వ్యవసాయం దండగ అన్న దుష్ప్రచారం గురించి ఇచ్చిన వివరణ.

వ్యవసాయంలో చంద్రబాబు తెచ్చిన విప్లవాలు

డ్రిప్ ఇరిగేషన్

మైనర్ ఇరిగేషన్ డెవలప్ మెంట్

స్ప్రింక్లర్స్

ఇజ్రాయిల్ వ్యవసాయం (కేసీఆర్ అదేఇపుడు చేస్తున్నారు)

నీటి క్రమశిక్షణ

చెక్ డ్యాములు

కరవు సాయం

విత్తన సాయం

వరద సాయం

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.