తెలుగుదేశం దూరదృష్టి ప్రపంచానికి రక్ష - చంద్రబాబు

మాటకారి తనం ఉంటే అబద్ధం కూడా నిజం అని నమ్మించొచ్చు. కానీ వ్యక్తిత్వ హననమే రాజకీయం వెలుగొందుతున్న నేటి రోజుల్లో పనిచేసిన వాడు జీరోగా పబ్లిసిటీ చేసుకున్న వాడు హీరోగా వెలుగొందుతున్నాడు.

నేడు దేశానికి, ప్రపంచానికి అతిపెద్ద ముప్పు కరోనా. అతి దేశ ఆర్థిక వ్యవస్థనే కాదు, వ్యక్తుల జీవితాలను కూడా పతనం అంచులకు తీసుకెళ్లింది. ఇపుడు కొంత కోలుకున్నా ఆ ముప్పు తప్పేది వ్యాక్సిన్ వచ్చాకనే.

నాయకుడు అనే వాడు ఏ నిర్ణయాలు తీసుకున్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు నా ఓటర్లను ఎలా మెప్పించాలి అని కాకుండా అయ్యా ఇలాంటోడు ఒకడు ఈ దేశ చరిత్రలో ఉన్నాడు అని చెప్పుకునే ఆలోచించే క్రమంలో చంద్రబాబు పలుమార్లు రాజకీయంగా వైఫల్యం చెందారు. కానీ భవిష్యత్తును నిర్మించడంలో ఏనాడు విఫలం కాలేదు. చివరకు టీఆర్ఎస్ వంటి ప్రత్యర్థి పార్టీ కూడా ప్రశంసించక తప్పని అభివృద్ధిని చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు.

ఆనాడు జీనోమ్ వ్యాలీ అనే బయోటెక్నాలజీ సెజ్ ను చంద్రబాబును నిర్మించారు. అది ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థలకు ఆలవాలంగా మారింది. నేడు ఈ కరోనా నుంచి బయటపడటానికి ఆ జీనోమ్ వ్యాలీలోని ఒక సంస్థ అయిన భారత్ బయోటెక్ ప్రపంచానికి మార్గం కనుక్కుంది. ఆ క్రెడిట్ కచ్చితంగా చంద్రబాబుదే. ఇది మేము చెబితే మీరు ఏమేమో ముద్రలు వేస్తారు.

కానీ కింద వీడియోలో ప్రత్యర్థుల మాటలో ఆ జీనోమ్ వ్యాలీ నిర్మించినది ఎవరో వినండి.

జీనోమ్ వ్యాలీ అనేది శాశ్వతం. అది ఉన్నంత కాలం దాని సృష్టికర్తగా చంద్రబాబు పేరు అలాగే నిలిచి ఉంటుంది. కేటీఆరే కాదు, మరెవరు అధికారంలో ఉన్నా దానిని అంగీకరించకతప్పదు.

తాజాగా ఆ జీనోమ్ వ్యాలీని, అందులో వ్యాక్సిన్ తయారుచేస్తున్న భారత్ బయోటెక్ సంస్థను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే...

ప్రధాని నరేంద్ర మోదీ COVID-19 వ్యాక్సిన్ ఉత్పత్తిని సమీక్షించడానికి రేపు హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీని సందర్శిస్తుండటం సంతోషంగా ఉంది. 90 వ దశకంలో దూరదృష్టితో చేసిన పని ఈరోజు COVID వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం భారతదేశంలో ముందంజలో నిలిచింది. 'జెనోమ్ వ్యాలీ' దేశంలోనే అత్యాధునిక R&D క్లస్టర్‌లో మొదటిది. 150 లైఫ్ సైన్స్ కంపెనీలు, వివిధ వాటాదారుల సహకారంతో, బయోటెక్ గురించి కూడా వినని సమయంలో 90 వ దశకంలో మా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన బయోటెక్ పార్కును నెలకొల్పింది. అది నేడు ఫలాలను ఇస్తోంది.
జీనోమ్ వ్యాలీ అనేది ఉపాధి & మౌలిక సదుపాయాలను భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని నిర్మించినదానికి ఒక ఉదాహరణ, ఇది జీవిత శాస్త్రాల యొక్క స్పెక్ట్రం నుండి కొన్ని ఉత్తమ ప్రతిభను ఆకర్షించింది. జీనోమ్ లోయలో ఉన్న భరత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కోవాక్సిన్' ఈ వాస్తవాన్ని రుజువు చేస్తుంది.
అక్కడి కంపెనీ భారత్ బయోటెక్   వినాశకరమైన మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి నేడు కృషిచేస్తోంది. మాకు సహాయపడటానికి అడుగులు వేస్తున్న అన్ని సంస్థలు మరియు సంస్థలకు నా కృతజ్ఞతలు. అవన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. భవిష్యత్ విధాన రూపకర్తలకు నా సందేశం: మీ విధానాలు భవిష్యత్తు రుజువుగా ఉండాలి!  

ఇది చంద్రబాబు సందేశం.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.