వారి చేతికి టీడీపీ పగ్గాలు... చంద్రబాబు కొత్త ఐడియా

2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన వైసీపీ ప్రతిరోజు  23 సీట్లే వచ్చిన టీడీపీపై ఎందుకు దాడి చేస్తోంది. టీడీపీలో ప్రతి కార్యకర్త చేసే ఒక్కో విమర్శ పార్టీనే ఎందుకు కుదిపేస్తుంది? తెలుసా? కారణం ఒక్కటే...వైసీపీకి వచ్చిన ఓట్లు 1,56,83,592తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 1,23,01,741రెండిటికీ తేడా 33,81,851 మాత్రమేఅంటే కేవలం 1,690,926 ఓట్లు టీడీపీ వైపు మళ్లితే వైసీపీ పని మటాష్.
సామాన్య జనం ఈ తేడా గురించి పట్టించుకోరు కాబట్టి వైసీపీ ఎందుకు టీడీపీకి భయపడుతుందో వారికి అర్థం కాదు.కానీ వైసీపీకి తెలుసు.... 16 లక్షల ఓట్లు అంటే కేవలం ఐదు ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్లతో సమానం. సింపుల్ గా చెప్పాలంటే... కేవలం ఇసుక వల్ల ఇబ్బంది పడి ఉపాధి కోల్పోయిన కూలీలు తెలుగుదేశం వైపు తిరిగి తమ బతుకుమీద కొట్టిన జగన్ పై కోపంతో టీడీపీకి వేస్తే వైసీపీ పని మటాష్.  అందుకే తెలుగుదేశం పార్టీని పాస్టర్లు కరోనాని తొక్కడానికి ట్రై చేసినట్టు నిష్ఫల ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు చంద్రబాబుకి రాజకీయం తప్ప ఇపుడు మరో డ్యూటీ లేదు. అధికారంలో పనుల్లో బిజీగా ఉన్నపుడు చంద్రబాబును ఎదుర్కొన్నంత సులువు కాదు ఇపుడు ఎదుర్కోవడం అని జగన్ కి, ఆయన బృందానికి తెలుసు. అందుకే తరచూ నిందలు వేసి  టీడీపీ నేతలను ప్రతివిమర్శల్లో బిజీగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా చంద్రబాబు తన పని తాను చేసుకుని పోతున్నారు. ప్రజలకు వైసీపీ అసమర్థతను, పాలన వైఫల్యాన్ని విమర్శిస్తుూనే మరోవైపు టీడీపీని ఎలా బలపరచాలో అలా బలపరుస్తున్నాడు. రేపు ఎన్నడో జరగబోయే జిల్లాల విభజనకు అనుగుణంగా జగన్ రెడ్డి తన పార్టీని సిద్ధం చేయలేకపోతున్నారు..  కానీ చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పార్టీని సిద్ధం చేయడమే కాదు, భవిష్యత్తులో వైసీపీ దాటికి తట్టుకోగలిన యువ బృందాన్ని తయారుచేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పార్టీని ప్రస్తుత జిల్లాల వారిగా కాకుండా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా విభజించి... 25 మంది యువ అధ్యక్షులను నియమిస్తున్నారు. వారితో పాటు ఏపీ అధ్యక్షుడిగా కూడా బీసీ నేత, రాష్ట్రంలో నిజాయితీకి పేరున్న అచ్చెన్నాయుడిని నియమిస్తున్నారు. మనిషి ఆజానుబావుడు. వాయిస్ లో బేస్, అతను మాట్లాడే విషయంలో పవర్... అందరికీ సుపరిచితమే. అందుకే రాజకీయ యువకుడైన అచ్చెన్నాయుడిని నియమిస్తే వైసీపీ దూకుడును ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదని పసిగట్టారు చంద్రబాబు. దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించడమే కాదు, యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.