పోలవరంపై అందరి అనుమానాలు తీర్చేసిన బుచ్చయ్య

వైసీపీకి భారీ దెబ్బ పడింది. తాము భుజాలపై మోసే మోడీ నుంచి వారు ఇలాంటి దెబ్బ ఊహించలేదు. మిగతా వాటిలా ప్రజలు మరిచిపోయే దెబ్బ కాదు అది. చాలా స్ట్రాంగ్ దెబ్బ. తిరిగి కోలుకోలేని దెబ్బ. జగన్ తనకు ఎదురుతిరగలేడన్న ఒకే ఒక కారణంతో నరేంద్ర మోడీ పోలవరం ప్రాజెక్టు ఖర్చును 60 శాతంపైన (35 వేల కోట్లు) కోత పెట్టారు. ఇది వైసీపీకి చావు దెబ్బ.

ఎందుకంటే చంద్రబాబు కేంద్రానికి వివరించి ఒప్పించుకుని వచ్చిన 55 వేల కోట్ల ప్రాజెక్టు విలువను అంత ఎందుకు, కేవలం బాబు దోచుకోవడానికే అని జగన్ రెడ్డి ఎన్నికల ముందు దుష్ప్రచారం చేస్తే కొందరు అమాయకులు నిజం అనుకుంటున్నారు. ఇపుడు అదే డబ్బులు ఇవ్వండి అని జగన్ అడుగుతుంటే అయ్యా ఆరోజు నువ్వే కదా 20 వేల కోట్లతో ప్రాజెక్టు కట్టొచ్చు,చంద్రబాబు అనవసరంగా 56 వేల కోట్లకు పెంచాడు అన్నావు. చంద్రబాబు 20 వేల కోట్లతో కట్టలేకపోయావు. నువ్వయితే కట్టేయగలవు. కట్టేసెయ్. మేమిచ్చేది 20 వేల కోట్లే అనే మోడీ టీం చెప్పేసింది. అంతే ఏపీ సర్కారు గుండె జారిపోయింది.

కేంద్రానికి ఎదురుతిరగలేడు. ఎదురుతిరగకపోతే ప్రజలే తనకు ఎదురుతిరుగుతారు. మరి ఇపుడు ఏం చేయాలో జగన్ అండ్ కోకు అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ పక్కన పెడితే పోలవరంలో ఎవరూ కాదనలేని నిజాలను స్పష్టంగా, శుద్ధంగా, వివరంగా అందరికీ అర్థమయ్యేలా తెలుగుదేశం నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివరించారు. అది వింటే పోలవరంపై మీకున్న అనుమానాలు అన్నీ పటాపంచలు అవుతాయి.

Must watch video :

గతంలో ఒకసారి మరిన్ని పోలవరం విషయాలను మంత్రికి వివరిస్తూ వైసీపీ గాలితీసేసిన వీడియో కింద చూడొచ్చు.

యథావిధిగా ఎపుడు ఏం బుర్రలోకి వస్తే అది మాట్లాడేసే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో వేసిన ట్వీటు కూడా కింద చూడొచ్చు.

ఈ ట్వీట్లో జగన్ రెడ్డి మోడీతో తన బలప్రదర్శన చేసి 55 వేల కోట్లకు ఒప్పించారు అన్నారు. మరి ఇపుడు ఏం సమాధానం చెబుతారు?

విచిత్రం ఏంటంటే... అప్పట్లో 55 వేల కోట్లు ప్రాజెక్టును పెంచడం మోసం అని సాక్షి పత్రికలో వేసిన ఆర్టికల్.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.