బ్రిటన్ ప్రధాని దీపావళి స్పీచ్ వైరల్

భారతీయులు జరుపుకునే దీపావళి పండగ ప్రపంచంలోనే విశేషమైన ఉత్సవాల్లో ఒకటి. మిగతా పండగల లాంటిది కాదు ఇది... భారతీయ పండగ ఇది. ప్రతి ఒక్క ఇంటి ముంగిట జరిగే విజయోత్సవ వేడుక ఇది. అయితే, ఈ దీపావళి సందర్భంగా ఒక మంచి విశేషం తెలుసుకుందాం.

నరకాసురుడిని సంహరించిన అనంతరం జీవితంలో వెలుగులు వచ్చాయని జరుపుకునే ఈ పండగ స్ఫూర్తితో కరోనావైరస్ మహమ్మారిని అధిగమించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చక్కటి సందేశం ఇచ్చారు. చీకటిపై కాంతి మరియు చెడుపై మంచి విజయం సాధించినందుకు దీపావళి స్ఫూర్తిని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల పెరుగుదలను అరికట్టడానికి, ఈ వారం ప్రారంభంలో ఇంగ్లాండ్ తన రెండవ దశ-లాక్డౌన్లోకి ప్రవేశించిన సందర్భంగా ఈ "భారీ సమిష్టి ప్రయత్నం" డిసెంబరు 2 వరకు కొనసాగించాలని బోరిస్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.

"నిస్సందేహంగా మనముందు పెద్ద సవాళ్లు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల మద్దతు మూలంగా మనం విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. మనకు దీపావళి బోధిస్తున్నట్లుగా, చీకటిపై కాంతి విజయం సాధిస్తుందని, చెడుపై మంచిది పై చేయి అని, అజ్ఞానంపై జ్ఞానం గెలుస్తుందని, ” అని లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ నుండి బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు.

"రావణుడు‘‘  ఓడిన అనంతరం రాముడు అతని భార్య సీత క్షేేమంగా ఇంటికి వెళ్ళినట్లే, ఆ రాముడి స్ఫూర్తిగా మన మార్గాన్ని కనుగొంటాము, విజయవంతంగా ముందుకు వెళ్తాం అని బోరిస్ అన్నారు.
లాక్డౌన్ పరిమితులతో ఈ సంవత్సరం ప్రజలు చాలా కష్టంగా జీవనం గడుపుతున్నారని తెలుసు. UK లోని భారతీయ ప్రవాసులందరి త్యాగాలు, సురక్షితమైన దీపావళి కోసం కృషి చేస్తున్నందుకు ప్రశంసించారు.

"లాక్ డౌన్లో వస్తున్న ఈ దీపావళిలో మీరు మీ కుటుంబ సభ్యులందరితో కలవాలనుకున్నప్పుడు లేదా మీ స్నేహితులను సందర్శించాలనుకున్నప్పుడు లేదా దీపావళి సరదాగా వారితో పంచుకోవాలనుకున్నప్పుడు దూరంగా ఉండి జరుపుకోవడం అంత సులభం కాదని నాకు తెలుసు అన్నారు. మూడు రోజుల వర్చువల్ దీపావళి ఫెస్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా బోరిస్ జాన్సన్ ఈ కీలక ఉపన్యాసం ఇచ్చారు.

ఇందులో యుకె హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్, ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మర్, లిబరల్ డెమొక్రాట్ నాయకుడు ఎడ్ డేవిలతో పాల్గొంటారు. కార్యక్రమాల్లో భాగంగా యోగా, సంగీతం మరియు నృత్య ప్రదర్శనలతో పాటు వివిధ రంగాలలోని బ్రిటిష్ ఇండియన్ కమ్యూనిటీ ఛాంపియన్లను గౌరవించే అవార్డుల ప్రదానోత్సవం కూడా ఉంది. గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ ఆండీ బర్న్హామ్ మరియు వెస్ట్ మిడ్లాండ్స్ మేయర్ ఆండీ స్ట్రీట్ ఇంగ్లాండ్ లోని వివిధ ప్రాంతాల నుండి దీపావళి సందేశాలను పంపే వారిలో ఉంటారు.

వారాంతంలో కొన్ని ఇతర వర్చువల్ ఈవెంట్లలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్‌ కూడా పాల్గొంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల భజనలు మరియు బ్రిటిష్ భారతీయ సంగీతకారుడు నవీన్ కుంద్రా నేతృత్వంలోని బాలీవుడ్ కచేరీ ఉన్నాయి. ఇక ఈఏడాది భారతదేశపు అత్యంత ప్రముఖ ఉత్సవం అయిన దీపావళిని నవంబర్ 14 న భారతీయలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.