తెలంగాణ ఉద్యోగ సంఘాలకు బండి సంజయ్ వార్నింగ్

కేసీఆర్ ని చూసి తెలంగాణ సమాజం... అబ్బ ఈ కాలానికి ఇలాంటి లీడరుండాలి మనకు అనుకుంది. తండ్రి మాటలు, కొడుకు ట్వీట్లు జనాలను బాగా ఆకట్టుకునేవి. కాలక్రమేణా... కాంగ్రెస్ తరచు చేస్తున్న గడీల పాలన ఆరోపణలను కేసీఆర్ కుటుంబం నిజం చేస్తూ వచ్చింది. తొలినాళ్లలో ప్రజలకు ఎంతో అందుబాటులో ఉన్నట్టు అనిపించిన కేసీఆర్ మెల్లగా తొలుత ప్రజలకు, ఆ తర్వాత సొంత పార్టీ నేతలకు కూడా దూరమయ్యారు.

ఇక టీఆర్ఎస్ అంటే ఇంటిపార్టీగా ముద్రేశాం. వేరేవాళ్లు వస్తే పరాయి వాళ్లనిముద్రేద్దాం అని కలలు కనేశారు. అక్కడక్కడా గెలిచిన కాంగ్రెస్ ను కలిపేసుకున్నారు. ఇంకే ముందు మనకు తిరుగేలేదు అనుకున్నారు.

కట్ చేస్తే...
బండి సంజయ్  అనే ఒక లీడరు వచ్చాడు

ధర్మపురి అరవింద్ అనే మరొక శక్తి అతనికి అండగా నిలిచింది

రాజాసింగ్ అనే ఒకటైగర్ ఎదురుపడ్డాడు

వీరు కేసీఆర్ మాటల గారడీలోని మాయను, నిజాన్ని... హంసలా వేరు చేస్తూ కేసీఆర్ లోని అసలు రూపాన్ని బయటపెట్టడంలో ఈ ముగ్గురు విజయవంతం అయ్యారు. కేసీఆర్ కి మించి మాట్లాడగలిగిన రఘనందన్ రావు కేసీఆర్, హరీష్, కేటీఆర్ ల సరిహిద్దు నియోజకవర్గంలోనే  టీఆర్ఎస్ ను పండబెట్టేశారు.

అబ్బా ఇదొక్కదాంతో అయిపోయినట్టా అని తడాఖా చూపించడానికి మున్సిపల్ ఎన్నికలు పెట్టారు కేసీఆర్. అప్పటికే వీరిపై కోపంగా ఉన్న ప్రజలు ఆయన కొడుకు కార్పొరేటర్ అభ్యర్థులని ముందు కు రా, వెనక్కు పో అంటూ గంగిరెద్దుల్లా చూడటంతో తెలంగాణ ప్రజానీకం నీ సంగతి చూస్తాం బిడ్డా అన్నది. అంతే దిమ్మి తిరిగి బొమ్మ కనపడింది.

మొత్తానికి తెలంగాణ  గడ్డపై కేసీఆర్ చేసేదే రాజకీయం అన్న భ్రమనుంచి జనం బయటపడ్డారు.... దానికి ఉదాహరణ నేటి బండి సంజయ్ మాటలు.
రైతులకు మద్దతు ఇస్తూ కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇది రైతులపై ప్రేమ కాదు, మోడీపై కసి పగ మాత్రమే అన్నది బీజేపీ ఆరోపణ.అయితే ఈ పోరాటంలో TNGO నాయకులు మధ్యలో దూరారు. వారికి ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్.

వాస్తవానికి ఉద్యోగ సంఘాల నేతలతో ఎవరూ పెట్టుకోరు. అలాంటిది వారికి బండి సంజయ్ ఏకంగా వార్నింగే ఇచ్చారు. అది సంజయ్ మాటల్లో చదివితేనే బాగుంటుంది.

బండి వేసిన ప్రశ్నలివే

టీ.ఎన్.జీ.వో నాయకులకు రేపటి బంద్ తో సంబధం ఏమిటి ?
ఉద్యోగుల సమస్యలపై కొట్లాడాల్సిన నాయకులు ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తుతున్నారు.
ఉద్యోగుల డీఏ, ఐఆర్, పి.ఆర్.సి ల గురించి మాట్లాడాల్సిన నాయకులు, టిఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలకై ప్రకటనలిస్తున్నారు.
ఉద్యోగుల డీఏ, ఐఆర్ గురించి మాట్లాడని సంఘాల నేతలు కెసిఆర్ తో కుమ్మక్కు అయ్యారు.
అసలు రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ లో ఉద్యోగ  సంఘాల నాయకులు ఎందుకు జోక్యం చేసుకుంటారు..? ఎలా పాల్గొంటారు..?
అవసరమైతే  ఉద్యోగ సంఘాల నాయకులపై ఫిర్యాదు చేస్తాం.
ఐ.ఆర్, డీఏ, పి.ఆర్.సి గురించి చర్చించేందుకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలా మద్దతిస్తారు..?
ఇప్పుడు ప్రకటనలిస్తున్న నాయకులు సన్న వడ్లు, రుణమాఫీలపై ఎందుకు స్పందించలేదు..!?
సన్న వడ్లకు కనీస మద్దతు ధర, బోనస్ విషయంలో ఉద్యోగ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు..?
ఉద్యోగుల మనోభావాలను కెసిఆర్ వద్ద తాకట్టు పెట్టారు.
ఎప్పటికీ ఒకే పార్టీ అధికారంలో ఉండదు అన్న విషయాన్ని ఉద్యోగ నేతలు గుర్తుంచు కోవాలి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.