బీజేపీ వ్యూహం ఫ‌లించింది.. కేసీఆర్ మారాల్సిందే!

తెలంగాణ‌లో బీజేపీ దూకుడు పెరిగింది. ఇటీవ‌ల దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ గెలుపు ద‌రిమి లా వ‌చ్చిన గ్రేట‌ర్ హైదరాబాద్ ఎన్నిక‌ల్లో.. బీజేపీ స‌త్తా చాటింద‌నే చెప్పాలి. గ‌త 2016 గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కేవ లం 4 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన బీజేపీ.. నేడు 40 స్థానాల పైబ‌డి ద‌క్కించుకోవ‌డం వెనుక‌.. ఆ పార్టీ వ్యూహం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కేంద్రం నుంచి అతిర‌థులైన నాయ‌కులు ఇక్క‌డ‌కు వ‌చ్చి ప్ర‌చారం చేయ డం, స్థానికంగా బండి సంజ‌య్ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత అనుస‌రించిన వ్యూహం.. ఇలా.. అనేక కార‌ణాలు.. బీజేపీని గెలుపు బాట‌పట్టించాయి.

బీజేపీ నేరుగా పోయి.. గ్రేట‌ర్ పీఠం ద‌క్కించుకోక‌పోయినా.. బ‌ల‌మైన ప్ర‌త్యామ్నాయంగా మాత్రం.. అవ‌త‌రిం చింద‌న‌డంలో సందేహం లేదు. ఎంఐఎం పార్టీని ప‌క్క‌న పెడితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అధికార ప‌క్షానికి కాంగ్రెస్ మాత్ర‌మే.. ప్ర‌త్యామ్నాయంగా మారింది. అయితే.. ఇప్పుడు బీజేపీ స‌త్తా చాటింది. ఆది నుంచి రాష్ట్రంపై క‌న్నేసిన క‌మ‌ల నాథులు.. రెండు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరంగా దెబ్బ‌తిన్నారు. అయితే.. మారుతున్న ప‌రిస్థితులు.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలోను, ప్ర‌జల అసంతృప్తిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలోను స‌క్సెస్ అవుతున్నారు.

వాస్త‌వానికి బీజేపీ ఎదుగుద‌ల‌పై 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత అనేక సందేహాలు వ‌చ్చాయి. అయితే.. 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల త‌ర్వాత .. ఒకింత ఆశలు రేకెత్తాయి. ఇక‌, దుబ్బాక విజ‌యం మ‌రింత‌గా పార్టీకి
నైతిక బ‌లం పెంచింది. ఇక‌, ఇప్పుడు గ్రేట‌ర్‌లో నాలుగు నుంచి న‌ల‌భై స్థానాల‌కు పైబ‌డి విజ‌యం సాధించ‌డం బీజేపీ.. మున్ముందు మ‌రింత విస్త‌రించేందుకు అవ‌కాశం ఉంద‌నే స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చిన‌ట్ట‌యింది. ఇక‌, టీఆర్ ఎస్ కు ఏదైనా ప్ర‌ధాన ప్ర‌త్యామ్నాయం ఉందంటే.. అది ఖ‌చ్చితంగా బీజేపీనేన‌ని చెప్ప‌క త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ ప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకుని టీఆర్ ఎస్ అధినేత వ్యూహాలు మార్చుకోక త‌ప్ప‌ద‌ని కూడా చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.