​నేటి నుంచి అమరావతి... ప్రతిరోజు​


అమరావతి తరలింపుపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ ప్రారంభమైంది. అన్ని పార్టీలను, ప్రభుత్వాలను కౌంటర్లు వేయమని చెప్పి నేటికి విచారణ వాయిదా వేసిన కోర్టు ఇక పై అక్టోబరు 5 నుంచి రోజువారి విచారణ చేపడతాం అని చెప్పింది. ఆరోజు ఇదే.  ఈరోజు నుంచి అమరావతిపై హైకోర్టులో విచారణ రోజు వారిగా జరగనుంది.

అమరావతి తరలింపుపై అనేక మార్గాల్లో  సుమారు 100 పిటిషన్లు దాఖలయ్యాయి. అధికార పార్టీ తప్ప ప్రతిపక్షాలన్నీ అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని అఫిడవిట్లు దాఖలు చేశాయి. రైతులను జగన్ పార్టీ నేతల దూషణలతో సహా ప్రతిదీ కోర్టుకు ఎక్కాయి.

అమరావతి తరలించాలంటే అమరావతి రైతులను తిట్టాల్సిన అవసరం ఏముంది? ఉన్నత స్థాయిలో ఉండి కూడా సొంత ప్రజలను అవమానించిన విధానం, ప్రభుత్వ నిర్ణయం ఎంత నష్టదాయకం అన్నది ఇలా ఒకటీ రెండు కాదు... అన్ని కోణాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని అన్నిటిని కలిపి విచారిస్తోంది హైకోర్టు.
అమరావతి కేసుల్లో, ప్రభుత్వం ఒంటరైపోయింది. ఢిల్లీ నుంచి మీడియా ద్వారా నరసాపురం ఎంపీ రఘురామరాజు ఉద్యమ రైతుల్లో ఉత్సాహం నింపారు. ఒకరకంగా రఘురామరాజు ఎంట్రీ ఇచ్చాక ఉద్యమం మరింత ఊపందుకుంది. అతను చెప్పిన బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పిటిషన్లు ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టనున్నాయి.

చివరకు బీజేపీ కూడా అమరావతికి జై అనక తప్పలేదు. వైసీపీ తన స్వార్థం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్న విషయం అందరికీ అర్థం కావడంతో జగన్ రెడ్డికి అన్ని వర్గాల నుంచి మద్దతు కరవైంది. తన పార్టీని ఎన్నికల్లో ఆదుకునే కంపెనీల విలువను పెంచడానికి రాజధాని తరలిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ ఆరోపించిన విషయం కూడా తెలిసిందే.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.