ఈ ఫొటో చూపించి ఏపీ మంత్రిని ఛీ కొడుతున్నారు


ఏపీ సర్కారు పెద్దలు జగన్ మాయలో ఏం మాట్లాడుతున్నారో సోయి కోల్పోయి మాట్లాడుతున్నారు. ఏదైనా పాయింట్ ఉంటే మాట్లాడాలి గాని... అర్థం పర్థం లేకుండా రాజధానిని తీసుకెళ్లి ఇంకోచోట పెడతాను అంటే రైతులు పార్టీలు, అందరూ అడ్డుకున్నారు.

రైతులు బతిమాలితే అక్కడ అమరావతి పెట్టలేదు. మీ భూములు ఇస్తే  రాజధాని కడతాం అని ప్రభుత్వమే బతిమాలింది. అగ్రిమెంట్ రాసిచ్చింది. అందులో రాజధాని కట్టి మీకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తామో రాతపూర్వకంగా పేర్కొంది. అపుడు ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చారు రైతులు. ఇపుడు తమ సొంత భూములను డబ్బులు తీసుకోకుండా ఇచ్చిన రైతులు బూతులు తిడుతున్నారు మంత్రులు.

ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు. నోటికొచ్చినట్లు రైతులను దూషిస్తారు. మాట్లాడేముందు కనీసం ఒక్కసారయినా ఆలోచించారా?.. భూములు రైతులు ఇచ్చారా? రైతులను భూములిమ్మని ప్రభుత్వం అడిగిందా అని? లేదు. చంద్రబాబు మీద రాజకీయ కక్ష తీర్చుకోవడానికి 30 వేల రైతుల కుటుంబాలను రోడ్డున పడేసే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. అందుకే వారు కోర్టుకు వెళ్లారు. ఎవరిది న్యాయం ఉంటే కోర్టులో వారు గెలుస్తారు.

తాజాగా ఓ మంత్రి మాట్లాడుతూ రైతులను రాయలేని బూతులు తిట్టి రాస్కోండి అని బరితెగించి మాట్లాడారు. రైతులు విమానం ఎక్కుతారా అని ఓ మంత్రి మాట్లాడతాడు. రైతంటే పేదోడు అని ఈ మంత్రికి  చెప్పిన దద్దమ్మ ఎవరు. అమరావతి పొలాలు 3 పంటలు పండుతాయి. వ్యవసాయం చేశారు. పిల్లల్ని చదివించుకున్నారు. రైతుల పిల్లలు చాలామంది బాగా సెటిలయ్యారు. రైతుకి, పేదరికానికి తేడా తెలియని వాళ్లు మంత్రులు ఎలా అయ్యారు. 3 పంటలు పండించే రైతు ఏడాదికి 3 నుంచి 10 లక్షలు సంపాదిస్తాడు. వారేం తాగుబోతులు కాదు డబ్బులు వృథా చేసుకోవడానికి ... ఈరోజు కష్టం వచ్చింది. ఆ కష్టం తెచ్చిందే గవర్నమెంటు. మరి ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్తే రైతు కాదంటే... అందులో అర్థం పర్థం ఏమైనా ఉందా?

ఫై ఫొటో చూడండి... ఒక రైతు రెక్కల కష్టంతో తన పిల్లలను చదివించాడు. పిల్లలు పెరిగి పెద్దయి అమెరికాలో సెటిలయ్యారు. వారి సాయంతో అమెరికాలోని ఓ నగరంలోని షాపింగ్ మాల్ లో ఎంచక్కా తిరిగేస్తున్న ఈ రైతుకి అమెరికా ఫ్లైటెక్కే హక్కు లేదా? రైతు ఫ్లెటెక్కొద్దని ఎక్కడైనా రాసుందా? ఇంత దిగజారిన మంత్రులు, నాయకులు ఏపీని ఏ తీరానికి తీసుకెళ్తారో. ఇంకెంత ముంచుతారో.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.