బిర్యానీ ఆర్టిస్టులు... లోకేష్ సెటైర్ !!

రైతుల పట్ల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుసరిస్తున్న పద్ధతిపై తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. అన్నంపెట్టే భూతల్లిని రాజధాని కోసం త్యాగం చేసిన వారిపై ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది అంటూ విమర్శించారు. అమరావతి చంపేసే కుట్రపై వారు శాంతియుతంగా ఉద్యమిస్తున్నారు.

మొన్న జగన్ అన్న పోలీసులతో సంకెళ్లు వేయించిన రైతులతో పాటు కృష్ణాయపాలెం (అమరావతి ప్రాంతం) రైతులు నారా లోకేష్ ని కలిశారు.  వారి త్యాగాల పునాదులపై ఏర్పడుతున్న అమరావతిని అడ్డుకోవద్దంటూ నినందించిన కృష్ణాయపాలెం రైతులకు జగనన్న బేడీలు వేయించారు. పైగా మళ్లీ ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి రైతులకు సంకెళ్లు వేశారా అంటూ నటించి పోలీసులను బలిచేశారు అని లోకేష్ ఆరోపించారు.

మూడుముక్క‌లాట‌కి మ‌ద్ద‌తుగా వ‌చ్చిన బిర్యానీ ఆర్టిస్టుల్ని అడ్డుకోవ‌డ‌మే నేరంగా ప‌రిగ‌ణించి, ఎస్సీల‌పైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారు అని లోకేశ్ విమర్శించారు. అవినీతి సంపాదన చేసేవారికి రైతుల కష్టం విలువ ఎలా తెలుస్తుంది అని లోకేష్ ఆరోపించారు.

లోకేష్ వేసిన వరుస ట్వీట్లు ఇక్కడ చూడొచ్చు

1. అన్న‌దాత‌లు వీరు..అన్నంపెట్టే భూత‌ల్లిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని కోసం త్యాగం చేసిన‌వాళ్లు.. అమ‌రావ‌తిని చంపేసే కుట్ర‌ల్ని నిర‌సిస్తూ శాంతియుతంగా ఉద్య‌మిస్తున్న‌వాళ్లు. మా త్యాగాల పునాదుల‌పై ఏర్ప‌డిన ప్ర‌జారాజ‌ధానికి స‌మాధి క‌ట్టొద్దంటూ నిన‌దించిన కృష్ణాయ‌పాలెం రైతులు..  ​

2. ​మూడుముక్క‌లాట‌కి మ‌ద్ద‌తుగా వ‌చ్చిన బిర్యానీ ఆర్టిస్టుల్ని అడ్డుకోవ‌డ‌మే నేరంగా ప‌రిగ‌ణించి, ఎస్సీల‌పైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారు @ysjagan. పోలీసుల‌కు ఫిర్యాదిచ్చిన వ్య‌క్తి కంప్ల‌యింట్ వెన‌క్కి తీసుకున్నా, మాన‌వ‌త్వ‌మ‌న్న‌దే మ‌రిచిపోయి అరెస్ట్ చేయించారు.​

3. ​ద‌ళిత, బీసీ రైతుల‌కు సంకెళ్లు వేయించ‌డం జ‌గ‌న్‌రెడ్డి శాడిజానికి ప‌రాకాష్ట‌. కృష్ణాయ‌పాలెం ద‌ళిత రైతులకి సంకెళ్లు వేసి జైలులో నిర్బంధించిన స‌మ‌యంలో వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించాను.అండ‌గా వుంటాన‌ని హామీ ఇచ్చాను.

​4. ​బెయిల్‌పై విడుద‌లై వ‌చ్చిన ద‌ళిత రైతులు జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు..​  త‌మ‌ని పెడుతున్న ఇబ్బందులు చెప్పి క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. ఎన్నాళ్ల‌యినా, ఎన్నేళ్ల‌యినా, కొట్టినా, చంపినా కూడా వెన్నుచూప‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మందే అంతిమ విజ‌యం. రైతుల పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండ‌గా వుంటుంద‌ని హామీ ఇచ్చాను.​ ​​

==

నమస్తే ఆంధ్ర TANA వార్తలు కింద చదవండి

‘తానా’'అధ్యక్ష'పోరులో 'త్రిముఖ' పోటీ-కాబోయే అధ్యక్షుడెవరు?

'తానా'లో కలకలం-పోటీనా? ఏకగ్రీవమా?

'తానా'లో సద్దుమణగని సందడి - ఎం జరుగుతోంది?
Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.